Eatala Rajendar (image credit:twitter)
Politics

Eatala Rajendar: హుజూరాబాద్‌లో గౌతం రెడ్డి రాజీనామా దేనికి సంకేతం?

Eatala Rajendar: బీజేపీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఈ మధ్యే అధిష్టానం తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) గుడ్ బై చెప్పారు. ఇదే క్రమంలో ఎంపీ ఈటల రాజేందర్‌(Etala Rajender)కు సైతం పొమ్మనక పొగ బెడుతున్నారన్న చర్చ జోరందుకుంది. అధ్యక్ష పదవి విషయంలో చివరి వరకు ఊరించి ఉసూరుమనిపించగా, వరుస అవమానాలు చోటు చేసుకుంటుండడంతో ఈటల అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. ఇదే క్రమంలో ఆయన అనుచరులు సైతం అసహనం వ్యక్తం చేస్తూ రాజీనామా బాట పట్టారు.

జిల్లాలో అంతర్గత పోరు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీజేపీ(BJP)లో కూడా అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. ఈటల రాజేందర్ వర్గీయులను ఉద్దేశపూర్వకంగానే వివక్ష చూపుతూ అవమానాలకు గురి చేస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నియోజకవర్గ కన్వీనర్ మండ గౌతం రెడ్డి(Gautham Reddy) తన పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి గురువారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడికి రాజీనామా పత్రం సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఈటల వర్గానికి అవమానాలు
తాను 2022లో భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్‌గా భాధ్యతలు నిర్వహిస్తూ, అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినట్టు గౌతం రెడ్డి తెలిపారు. కానీ, ప్రస్తుత పరిస్థితులతో, భారతీయ జనతా పార్టీలో నెలకున్న అంతర్గత పోరు, ఆదిపత్య పోరు ఈటల రాజేందర్ వర్గాన్ని ఒక ప్రణాళిక ప్రకారం అవమానాలకు గురిచేస్తూ అణచివేస్తున్న తీరుతో కలత చెందినట్టు పేర్కొన్నారు. అందుకే పార్టీలో కోనసాగలేనని, భావించి, రాజీనామా చేస్తున్నానని గౌతం రెడ్డి పేర్కొన్నారు.

Also Read: CPI leader Murder: కుంట్లూరు భూదాన్​ భూముల్లో వేసిన గుడిసెల వివాదమే కారణం?

అణచివేత నుంచి మొదలైన వ్యతిరేకత
ఈటల రాజేందర్‌తో పాటు బీజేపీలో చేరిన వారిని మొదటి నుంచి పక్కకు పెడుతూ కేవలం కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వర్గానికి చెందిన పాత బీజేపీ వర్గీయులకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఈటల వర్గీయులను పదవులకు, పార్టీకి దూరం పెడుతూ కనీసం సమాచార ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎంపీగా బండి సంజయ్(Bandi Sanjay) గెలుపు కోసం అంకిత భావంతో పని చేసిన వారిని కూడా కేవలం ఈటల రాజేందర్ సహచరులు అనే కారణంగా ఇబ్బందులపాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా, మండల పార్టీ పదవుల నియామకంలో ఈటల వర్గం నాయకులను, కార్యకర్తలను పూర్తిగా ఉద్దేశ పూర్వకంగా పక్కన పెట్టారని ఆరోపిస్తూ ఇటీవలే ఆయన అభిమానులు అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈటలను కలిసేందుకు సిద్ధం
వివక్ష చూపుతూ పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఈటల వర్గీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వారు భవిష్యత్ తేల్చుకోవాలని అందుకు ఈటలను కలిసి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. శనివారం ఈటల రాజేందర్‌(Etala Rajender)ను కలిసి వారి గోడు వెళ్లబోసుకునేందుకు ప్రిపేర్ అవుతున్నారు.

వర్గపోరు ఎక్కడికి తీసుకెళ్తుందో..
ఈటల రాజేందర్, బండి సంజయ్ వర్గీయుల మధ్య నెలకొన్న వివాదం ఏ స్థాయికి చేరుతుందో అనే చర్చ సర్వత్రా సాగుతున్నది. ఇది ఎటు దారి తీస్తుందో తెలియడం లేదు. ఇప్పటికే అధ్యక్ష పదవి విషయంలో అలిగిన ఈటల, వరుసగా తన అనుచరులకు, తనకు అవమానాలు ఎదురవుతుండడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ జరుగుతున్నది. అనుచరులతో శనివారం భేటీ తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొన్నది.

Also Read: Viral Video: ఏం గుండెరా అది.. భారీ అనకొండను భలే పట్టేశాడు!

 

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు