pooja hedje ( image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Pooja Hegde: ‘మోనికా’ పాట కోసం వాటిని కూడా లెక్కచెయ్యలేదు.. పూజా హెగ్డే

Pooja Hegde: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కూలీ’(Coolie). ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాకు మంచి హైప్ తెచ్చాయి. ఇటీవల విడుదలైన పాట ‘మోనికా’ అయితే యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది. పూజాహెగ్డే, సౌబిన్‌ షాహిర్‌తో కలిసి వేసిన డ్యాన్స్‌కు సినీ ప్రియుల సలాం కొడుతున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూసి తాను ఎంతో సంతోష పడుతున్నానని పూజా అన్నారు. దీనిక సంబంధించి ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

Read also- Panchayat Elections: తెలంగాణ పల్లెల్లో ఆశావాహుల కోలాహలం.. అధినేతలు, గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు!

‘కూలీ’ సినిమాలో మోనికా అంటూ స్పెషల్ సాంగ్ చేశానని. దానిని తీసే సమయంలో కాలు బెణికిందని అయినా పాట కోసం డాన్స్ చెయ్యాల్సి వచ్చిందని అన్నారు. తన కేరీర్‌లో ఏంతో శ్రమించి చేసిన పాటగా మోనిక ఉంటుందని అన్నారు. దీనికి కష్టపడినట్లు ఏ పాటకీ అంత కష్టపడలేదన్నారు. మెనిక సాంగ్ లో కాలు బెణికినా అవేమీ కనిపించకుండా కేవలం గ్లామరస్ గా కనిపించడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందన్నారు. చివరికి ఈ పాట రిజల్ట్ చూసి వాటన్నింటినీ మర్చిపోయానని చెప్పుకొచ్చారు. ఈ పాటను థియేటర్ లో చూసినపుడు మీరంతా డాన్స్ చేసేలా ఉంటుందన్నారు. అంతే కాకుండా ఈ పాట షూట్ సమయంలో శివరాత్రి వచ్చిందని, ఆ రోజు ఉపవాసం కూడా ఉన్నానని అన్నారు. దీనిని చూసిన నెటిజన్లు పూజాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆగస్టు 14న ‘కూలీ’ సినిమా విడుదల కానుండటంతో నిర్మాతలు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు.

Read also- Karthika Deepam Sushma: ఘోరంగా ఏడుస్తూ.. ఇదే నా చివరి రోజు.. సంచలన వీడియో రిలీజ్ చేసిన కార్తీక దీపం నటి

యాక్షన్‌ థ్రిల్లర్‌ రూపొందుతున్న ‘కూలీ’ మూవీ హార్బర్‌ ఇతివృత్తంగా సాగే కథ. నాగార్జున, ఆమిర్‌ఖాన్‌, ఉపేంద్ర, సౌబిన్‌ షాహిర్‌, శ్రుతిహాసన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ‘మోనికా’ పాటను టీమ్‌ విడుదల చేసింది. పాటకు ఫిదా అయిన సినిమా ప్రేక్షులు మోనికా అంటూ డాన్సులు వేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ పాట తెలుగు, తమిళం, హిందీలో 21 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది. సౌబిన్‌ షాహిర్‌ డ్యాన్స్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. అతను అసలు ఎవరు అన్న దానిపై ఇంటర్నెట్ లో నెటిజన్లు తెగ సోధిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

OTT MOvie: ఇద్దరు ట్విన్స్‌కు ఒకే క్వీన్.. ఇక చూసుకో ఎలా ఉంటదో..

Golden Care: సీనియర్ సిటిజన్ల కోసం కొత్త కార్యక్రమం.. ప్రారంభించిన సీపీ సుధీర్ బాబు

Seethakka: ఆడబిడ్డల గౌరవానికి ప్రతీక బతుకమ్మ.. సీతక్క కీలక వ్యాఖ్యలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంట గ్రాండ్ ఓపెనింగ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్సవాలు

Thaman speech: అలా ఏమీ చేయకపోయినా ‘ఓజీ’ హిట్ చేశారు.. ఎందుకంటే?