The Rajasaab
ఎంటర్‌టైన్మెంట్

The Rajasaab: మళ్లీ వాయిదా.. అసలు రిలీజ్ చేసే ఆలోచన ఉందా?

The Rajasaab: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), మారుతి (Maruthi) కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘ది రాజాసాబ్’ మూవీ మళ్లీ వాయిదా పడుతుందా? మేకర్స్ చెప్పినట్లుగా డిసెంబర్ 5న ఈ సినిమా విడుదలవడం కష్టమేనా? అంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో వినిపిస్తున్న వార్తలను బట్టి.. కష్టమే అని తెలుస్తోంది. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిన ‘ది రాజా సాబ్’ చిత్రం మరోసారి వాయిదా అంటూ వస్తున్న వార్తలతో ఫ్యాన్స్ కూడా నిరాశకు లోనవుతున్నారు. అంతేకాదు, అసలు రిలీజ్ చేసే ఆలోచన ఉందా? అంటూ మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరానికి రెండు సినిమాలు వచ్చేలా చూస్తానని ‘ఆదిపురుష్’ సమయంలో రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు మాటిచ్చిన విషయం తెలిసిందే. మాట ఇచ్చినట్లుగానే దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఆయన సైన్ చేశారు. కానీ, విడుదల ఎప్పుడంటే ఏ ఒక్కటీ చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఫ్యాన్స్ ఎంతగానో ఆశలు పెట్టుకున్న ‘ది రాజాసాబ్’ మరోసారి వాయిదా అంటే.. ఆ మాత్రం కోపం రాకుండా ఎలా ఉంటుంది? అయితే, ఈ వాయిదాకు సంబంధించి ఇంత వరకు మేకర్స్ నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు.

Also Read- Nidhhi Agerwal: పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా చేస్తే.. వేరేవి వంద సినిమాలు చేసినట్లే!

టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ‘ది రాజా సాబ్’ రాబోయే సంక్రాంతి బరిలోకి వెళ్లిపోయిందని అంటున్నారు. కాకపోతే ‘సంక్రాంతి’కి వచ్చేందుకు ఆల్రెడీ నాలుగైదు సినిమాలు కర్చీఫ్ వేసుకుని మరీ ముందస్తు ప్రకటనతో ముస్తాబవుతున్నాయి. అందులో చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రం ఉంది. రవితేజ, నవీన్ పోలిశెట్టి వంటి వారి సినిమాలు ఆల్రెడీ సంక్రాంతికి అంటూ అధికారిక ప్రకటన కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రభాస్ ‘రాజా సాబ్’ కూడా సంక్రాంతికే అంటే థియేటర్ల కొరత తప్పకుండా ఉంటుంది. ఆ ప్రభావం కలెక్షన్లపై పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి, అంతకంటే ముందే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నాలుగైదు సినిమాలతో కాకుండా, సోలో రిలీజ్ చూసుకుని వస్తే బెటర్ అని చిత్ర టీమ్‌కు ఫ్యాన్స్ సలహాలిస్తున్నారు.

Also Read- Air India Crash: ఎయిరిండియా క్రాష్‌పై వెలుగులోకి పెనుసంచలనం!

మరో వైపు ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి సాంగ్స్ షూట్ బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. విదేశాల్లో పాటల చిత్రీకరణ జరపాల్సి ఉంది. ప్రస్తుతం మేకర్స్ అదే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మాములుగా ఈ సినిమాను రూ. 200 కోట్ల బడ్జెట్‌తో మొదలుపెట్టారు. కానీ దాదాపు రూ. 400 కోట్లకి పైగా బడ్జెట్ అవుతుందని టాక్ నడుస్తుంది. ప్రభాస్ స్టామినాకు ఈ బడ్జెట్ పెద్ద లెక్క కాదు కానీ, ఆదిపురుష్ విషయంలో కూడా ఇలాగే తొందరపడ్డారు. అందుకే, ఏదీ నమ్మడానికి లేదు. కాకపోతే, రీసెంట్‌గా వచ్చిన టీజర్ మెప్పించడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలను పెంచేయడంతో, బిజినెస్ పరంగా ఈ సినిమాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదని, మంచి కొటేషన్స్ వస్తున్నాయనేలా టాక్ వినబడుతోంది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ వంటి వారు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్ లేదంటే నయనతార స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మేకర్స్ ఎవరిని ఫైనల్ చేశారనేది ఇంకా తెలియలేదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?