bakasura restaurant (image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Bakasura Restaurant: ‘బకాసుర రెస్టారెంట్‌’.. విడుదల తేదీ ఎప్పుడంటే?

Bakasura Restaurant: యూట్యూబ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, కమెడియన్‌ ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’, ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌, షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌ తదితరులు ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. హంగర్‌ కామెడీ జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నాయి. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌ యూట్యూబ్ లో మిలియన్స్‌లో వ్యూస్ సంపాదించుకున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 8న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని నిర్మాతలు తెలిపారు.

Also read- Mega vs Allu: అల్లు అరవింద్ బుద్ధి చూపించాడు.. ‘వీరమల్లు’కి పోటీగా ఆ సినిమా!

ఈ సినిమా చూసిన వాళ్లకు ఓ మంచి విందు భోజనం ఆరగించిన ఫీల్‌ కలగబోతుందని మూవీ టీం చెబుతోంది. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ ‘హంగర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది. సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మీ హృదయాలను హత్తుకునే ఎమోషన్‌ కూడా ఉంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా చూశామనే సంతృప్తిని పొందుతారు’ అని అన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ను చూస్తుంటే దర్శకుడు కొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కి్ంచినట్లు్ తెలుస్తోంది. హర్రర్, హంగర్, కామెడీ కలగలిపిన పసందైన విందు భోజనంలా ‘బకాసుర రెస్టారెంట్‌’ ఉంది.

Also read- Air India Crash: ఎయిరిండియా క్రాష్‌పై వెలుగులోకి పెనుసంచలనం!

ఈ చిత్రం నుంచి బకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను ర్యాప్‌ సింగర్‌ రోల్‌ రైడ్‌, వికాస బడిస ఆలపించారు. కేజీఎఫ్‌ గరుడ రామ్‌, కృష్ణభగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఉప్పెన జయకృష్న, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌పటాస్‌, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్‌, జబర్థస్త్‌ అప్పారావు తదితరులు వఖ్య పాత్రల్లో అలరించనున్నారు. కొత్త కథాశంతో ఈ సినిమా రానుండటంతో ప్రేక్షకుల నుంచి బారీ అంచనాలే నెలకొన్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?