Shambhala (IMAGE SOURCE : X))
ఎంటర్‌టైన్మెంట్

Shambhala: విడుదలకు సిద్ధమవుతున్న ‘శంబాల’.. నాట్స్ లో హాట్ టాపిక్‌!

Shambhala: యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచారం చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. ఈ సూపర్‌ నేచురల్ థ్రిల్లర్ మూవీ టీజర్ అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తించింది. విదేశాలలో తెలుగు సంస్కృతి, సినిమా సెలెబ్రేట్ చేసే ప్రతిష్టాత్మక సమావేశాలలో ఒకటైన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ (NATS) 2025 కార్యక్రమం ఒకటి. అందులో టాలీవుడ్ ప్రముఖులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్, సమంత, శ్రీలీల తదితరులు హాజరైన కార్యక్రమంలో ‘శంబాల’ సినిమా టీజర్‌ను నిర్మాతలు ప్రదర్శించారు. దీంతో అక్కడ ఉన్న వారి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ను చూసిన అక్కడివారు సినిమా టీంపై  ప్రశంసలు కురిపించారు.

Read also- Genelia: నా భ‌ర్త అలాంటి వాడే.. నన్ను చాలా టార్చ‌ర్ చేశాడు.. జెనీలియా సంచలన కామెంట్స్

‘శంభాల’ టీజర్‌ను సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ లైవ్ కచేరీలో ప్లే చేశారు. దీంతో అక్కడ ఉన్నవారిని ఈ టీజర్ ఎంతో అలరించింది. ప్రముఖుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం ‘శంభాల: ఎ మిస్టికల్ వరల్డ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీని ఓ విజువల్ వండర్‌గా రూపొందించేందుకు టెక్నికల్‌ టీం అహర్నిషలు కష్టపడుతోంది. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా ప్రవీణ్ కె. బంగారి అద్భుతమైన విజువల్స్ అందించగా.. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

Read also- Air India Crash: ఎయిరిండియా క్రాష్‌పై వెలుగులోకి పెనుసంచలనం!

ఇప్పటికే విడుదలైన టీజర్ ను చూస్తుంటే అంచనాలను మించి ఉంది. విజులల్ వండర్ అయ్యేలా కనిపిస్తుంది. దర్శకుడు స్టోరీలో చాలా డెప్త్‌గా రాసుకున్నాట్లు కనిపిస్తుంది. ఆది సాయికుమార్ యాక్టింగ్, యాక్షన్ అదిరిపోయేలా ఉంది. సంగీతం కూడా సినిమాకు తగ్గట్టుగా ఉంది. ఓవరాల్ గా విడుదలైన టీజర్‌ను, గ్లింప్స్‌ను చూస్తుంటే విడుదలకు ముందే మంచి అంచనాలు సెట్ చేసింది. థియేట్రకల్ బిజినెస్ కూడా చాలా మంచి ధరకు అమ్ముడుపోయేలా కనిపిస్తుందని సినిమా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు మూవీ టీం త్వరలోనే ప్రకటించనున్నారు. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆది సాయికుమార్ కెరీర్‌లో మంచి విజయం సాధిస్తుందని క్రిటిక్స్ చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

ACB Rides: ఏసీబీ వలలో గ్రామ పరిపాలన అధికారి.. దేవుడే పట్టించేనా..!

Mass Jathara: మాస్ జాత‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్.. రవితేజ కోసం కోలీవుడ్ స్టార్ హీరో..?

Karimnagar Crime: రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. పక్కింటి వారితో కిటికీ లొల్లి.. ప్రాణం తీసుకున్న మహిళ

CP Sajjanar: తాగి డ్రైవింగ్ చేస్తే వాళ్ళు టెర్రరిస్టులు: సీపీ సజ్జనార్

Cobra Snake Video: ఏకంగా పాముతో లిప్ కిస్.. వీడెంటి బాబోయ్ ఇలా చేస్తున్నాడు? వీడియో వైరల్