Mahesh Kumar Goud: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్‌ను కామారెడ్డిలో ప్రవేశపెట్టి, బిల్లు చేసిన సమయంలో తాను పీసీసీ అధ్యక్షుడిగా పాత్ర పోషించానని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ( Mahesh Kumar Goud )పేర్కొన్నారు. కర్ణాటకలో ఆయన మాట్లాడుతూ.. అక్టోబరులో హైదరాబాద్‌లో ఓబీసీ సలహా మండలి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కలలు కన్న బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుందని, ఈ విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు.
Also Read: Indira Mahila sakthi: అతివలకు అండగా.. ఇందిరా మహిళా శక్తి
అన్ని రకాలుగా న్యాయం
రిజర్వేషన్లపై అన్ని రకాలుగా న్యాయ, చట్ట, రాజకీయ పరంగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. తెలంగాణలో అగ్రవర్ణ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు. అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కమిషన్, బీసీ డెడికేషన్ కమిషన్, కులఘనన, అసెంబ్లీలో బిల్లు, గవర్నర్‌కు ఆర్డినెన్స్ వంటి అన్ని రకాల చర్యలు తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీ వీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Also Read: TPCC Gajjela Kantham: కాళేశ్వరం అవినీతి.. తీహార్ జైలుకు కేసీఆర్ ఫ్యామిలీ.. కాంగ్రెస్ నేత