Dancing Queen: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ కాలం రాణించడం అరుదు. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్‌డమ్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ అలాంటి అసాధారణ కథ కలిగిన అమ్మాయి. ఆమె చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి, సంచార జీవితంతో బాల్యాన్ని గడిపి, సరైన విద్య కూడా, సినిమా రంగంలోకి అడుగుపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచే స్థాయికి ఎదిగింది. తొలి సినిమా ఫ్లాప్ అయినా, ఆమె ధైర్యంగా నిలబడి, తన సత్తా చాటి, ఇప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.
Also Read: Ice Discovered in Space: అంతరిక్షంలో మంచుపై షాకింగ్ అధ్యయనం.. అందులో ఏం తేలిందో తెలిస్తే షాకే!
బాలీవుడ్‌లో డ్యాన్సింగ్ క్వీన్
1983 జులై 16న హాంకాంగ్‌లో జన్మించిన కత్రినా కైఫ్, కశ్మీరి తండ్రి మహమ్మద్ కైఫ్, బ్రిటిష్ తల్లి సుజానే టర్కోట్ దంపతులకు జన్మించింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో తల్లితో పెరిగింది. తల్లి సామాజిక కార్యకర్తగా ఉండటంతో, కత్రినా బాల్యం 18 దేశాల్లో సంచార జీవితంగా గడిచింది. దీంతో సరైన విద్యాబ్యాసం లేక ఇంట్లోనే ఉండి చదువుకుంది. అయినా, ఆమె ఈ కష్టాలను అధిగమించి బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
Society for Social Auditl: సోషల్ ఆడిట్‌కు సహకరించని అధికారులు.. పంచాయతీ రాజ్ ససేమిరా!
వ్యక్తిగత జీవితం
2021లో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్‌ని పెళ్లి చేసుకున్న కత్రినా, అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పెళ్లికి ముందు ఆమె రణ్‌బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి బడా స్టార్స్ తో డేటింగ్ చేసి రూమర్లలో ఉండేది. ఇంత మందితో ఎఫైర్ నడిపి ఆమె విక్కీ ని వివాహం చేసుకుంది. ఆ హీరోతో రహస్య సంబంధం తర్వాత అతన్ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. కత్రినా నికర సంపద సుమారు రూ.263 కోట్లు ఉందని అంచనా.
Samantha: నాగచైతన్యదే తప్పు.. భార్య దగ్గర నిజాయితీగా ఉండాలంటూ.. సమంత సంచలన కామెంట్స్