Nayanthara ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Nayanthara: షూటింగ్ లో నయనతార, విఘ్నేష్ మధ్య పెద్ద గొడవ.. విడాకులు కోసమేనా?

Nayanthara: ఇటీవల నయనతార, విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని ఒక స్క్రీన్‌షాట్ మెసేజ్ వైరల్ కావడం! నయనతార పేరుతో ఒక పోస్ట్ నెట్టింట విపరీతంగా చక్కర్లు కొట్టింది. అది నయనతార షేర్ చేసి, తర్వాత డిలీట్ చేసినట్లు కొందరు నెటిజన్లు స్క్రీన్‌షాట్‌లు తీసి వైరల్ చేశారు. కానీ, ఆ పోస్ట్ లో నిజం లేదని, ఎవరో నయనతార ఐడీని ఉపయోగించి ఫేక్ పోస్ట్ చేశారని తేలిపోయింది.

క్లారిటీ ఇచ్చిన రూమర్స్ ఆగడం లేదుగా?

ఈ విడాకుల రూమర్లు వచ్చిన రెండు రోజులకే నయనతార తన భర్త విఘ్నేష్, పిల్లలతో కలిసి గుడికి వెళ్లి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు, ఈ రూమర్లకు సమాధానంగా తన భర్తతో ఒక క్యూట్ ఫోటోని షేర్ చేసి, తమ మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని స్పష్టం చేసింది. అయితే, ఇదంతా సద్దుమణిగిన తర్వాత, తాజాగా ఓ కొత్త వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో నయనతార, విఘ్నేష్ గొడవ పడుతున్నట్లు కనిపించింది.

Also Read: Hyderabad Land Dispute: నమ్మి మోసపోయామంటున్న బాధితులు.. రూ.2 వేల కోట్లకు పైగా నష్టమంటూ ఆవేదన

సెట్ లో ఇద్దరి మధ్య పెద్ద గొడవ?

ఆ వీడియోలో ఏముందంటే.. షూటింగ్ సెట్‌లో నయనతార మానిటర్ ముందు కూర్చొని బిగ్గరగా అరుస్తూ ఉంటుంది. విఘ్నేష్ శివన్, “డైరెక్టర్ గారు, కాస్త నెమ్మదిగా.. ఎనర్జీని కంట్రోల్ చేయండి” అని చెబుతాడు. దానికి నయనతార, “హీరో గారు, కూల్ అవ్వండి, షూటింగ్ ఇంకా చాలా రోజులుంది” అంటూ సమాధానమిస్తుంది. విఘ్నేష్ షాక్ అయి ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. కానీ, ఇదంతా ఓ  కంపెనీ యాడ్. దీనిలో   నయనతార, విఘ్నేష్ కలిసి నటించి,  ఫ్యాన్‌లలోని కొత్త మోడల్స్‌ను చూపించారు.

Also Read: Telangana: ప్రైవేటుతో ఎలక్ట్రిక్ బస్సుల ఒప్పందం రద్దు చేసుకోవాలి.. సీఎంకు ఆర్టీసీ ఎంప్లాయిస్ లేఖ

విడాకులు లేవన్నారు.. మరి ఇదేంటి?

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. “విడాకులు లేవన్నారు కదా, మరి ఈ గొడవ ఏంటి?” అంటూ ఫన్నీగా పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే, ఇదంతా కేవలం యాడ్ కోసమే అయిన చూసిన వాళ్ళు మాత్రం వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో మీకేందుకు అంటూ ఇంకొందరు ఫైర్ అవుతున్నారు.

Also Read: Ariyana Glory: బెడ్ రూమ్ లో మా బావ మరో అమ్మాయితో అలాంటి పని.. చూసి బ్రేకప్ చెప్పా.. బిగ్ బాస్ బ్యూటీ

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు