BJP Chief Ramchander Rao (image credit: swetcha reporter)
Politics

BJP Chief Ramchander Rao: గెలిచినా ఓడినా సిద్ధాంతం కోసం పనిచేస్తా.. రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు

BJP Chief Ramchander Rao: లాయర్లు న్యాయం కోసం ఎలా పనిచేస్తారో, ప్రజల సేవలో కూడా అంతే అంకితభావంతో పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchandra Rao) తెలిపారు. ఆయన బీజేపీ స్టేట్ చీఫ్‌గా నియామకమవ్వడంపై రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ, తాను కూడా అడ్వకేట్ కమ్యూనిటీకి చెందినవాడినేనని, ఇలాంటి వేదికపై మాట్లాడే అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందన్నారు. అంతా వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందినా, కోర్టులో వాదనలు పూర్తయ్యాక అంతా కలిసిమెలిసి ఉంటామని తెలిపారు.

 Also Read: ACB Arrests: ఏసీబీ వలలో పంచాయితీ రాజ్ ఇంజినీర్ ఇన్ ఛీఫ్‌

అరుణ్ జైట్లీ, కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వంటి ప్రముఖ న్యాయవాదులు వేర్వేరు పార్టీలకు చెందినవారైనా కోర్టులో కలిసి పని చేశారని గుర్తుచేశారు. యువ న్యాయవాదులు ఈ ప్రొఫెషన్‌ను సిన్సియర్‌గా తీసుకుని పని చేయాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను చూస్తున్నామని, అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే చాలా మంది భయపడుతున్నారన్నారు. కొత్త కొత్త బూతులు నేర్చుకోవాల్సి వస్తుందని ప్రజలు చెబుతున్న పరిస్థితి నెలకొందన్నారు.

తెలంగాణ ఏర్పాటులో న్యాయవాదులు ఎంతో కీలక పాత్ర పోషించారని తెలిపారు. దేశవ్యాప్తంగా రాజ్యసభ, లోక్‌సభలలో సుమారు 250 మంది న్యాయవాదులు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారని రాంచందర్ రావు (Ramchandra Rao) తెలిపారు. ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి రావాలని సూచించారు. గెలిచినా, ఓడిపోయినా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం మాత్రమే పని చేస్తున్నానని, డబ్బు కోసం ఎప్పుడూ రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు.

బూత్ నుంచే గెలుపు

గెలుపు అనేది బూత్‌లోనే జన్మిస్తుందని, ఒక్కో బూత్ గెలిస్తే ఒక్కో నియోజకవర్గం మనదవుతుందని, ఒక్కో నియోజకవర్గం మనదైతే తెలంగాణలో అధికారం సొంతం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchandra Rao) తెలిపారు. ఘట్ కేసర్‌లో బుధవారం నిర్వహించిన డివిజన్, మండల అధ్యక్షుల కార్యశాల ముగింపు సమావేశానికి హాజరై మాట్లాడారు. ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీ ప్రాణమని, వారిని గుర్తించాలని, గౌరవించాలని, ప్రోత్సహించాలని కోరారు. ప్రతి డివిజన్‌, మండల స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక భారీ కుంభకోణాలు జరిగాయని, ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోలేదని విమర్శలు చేశారు. ప్రతి కార్యకర్త కష్టపడితే తెలంగాణలో అధికారం సాధ్యమని వ్యాఖ్యానించారు.

 Also ReadRamchander Rao: టీబీజేపీలో చక్రం తిప్పేదెవరు.. తెర వెనుక కీలక నేతలు

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?