Tragedy Love: ప్రేమ గుడ్డిది.. నడ్డిది.. ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు.. కనీసం ఊహకు కూడా అందదు.. మరీ ముఖ్యంగా వయసు, సొగసు ఇలాంటివి అస్సలు ఉండవ్.. అదంతే! ఇప్పుడు మీరు చదవబోయే వార్త కూడా అలాంటిదే అందుకే ఈ ఇంట్రో అన్నమాట. కూతురు వయసున్న యువతిని లోబరుచుకుని పెళ్లి చేసుకున్నాడు. తీరా చూస్తే ఇరువురూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పరిస్తితి. ఈ విషయం తెలిసి లవర్స్ నవ్వాలో.. ఏడవాలో కూడా అర్థంలో స్థితిలో ఉండిపోతున్నారు.. అసలు ఈ వయసులో వారిద్దరికి ప్రేమ ఎలా సాధ్యమైంది? కూతురి వయసున్న యువతితో వెళ్ళిపోవడానికి ఆయనకు.. తండ్రి వయసున్న ఆయనతో వెళ్లడానికి ఆ యువతికి ఎలా మనసు ఒప్పింది? అంటూ చిత్ర విచిత్రాలుగా ప్రశ్నలు మెదులుతున్న పరిస్తితి.
ఇదండోయ్ అసలు సంగతి..!
వరంగల్ ఎనుమాముల ఇందిరమ్మ కాలనీకి చెందిన 22 ఏళ్ల గాయత్రి ఇంటర్ మధ్యలోనే చదువు ఆపేసి ఇంట్లోనే ఉంటోంది. వీరి ఇంటి ఎదురుగా ఉండే డీసీఎం డ్రైవర్ వేల్పుగొండ స్వామి(42)కి పెళ్లై, ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయినా గాయత్రికి మాయమాటలు చెప్పి లోబరుచుకుని ప్రేమాయణం నడిపాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో 6 నెలల కింద గాయత్రి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఇరువురినీ పెద్దలు మందలించడంతో స్వామి హన్మకొండకు మకాం మార్చాడు. కానీ, గాయత్రితో సీక్రెట్‌గా సంబంధం మాత్రం సాగించాడు. గాయత్రికి పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు భావించగా, ఈనెల 2న 10 తులాల బంగారం, నగదు తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయింది.
Also Read- The Girlfriend: ‘నదివే’ అంటూ వచ్చిన నేషనల్ క్రష్.. సాంగ్ వినాల్సిందే, డ్యాన్స్ చూడాల్సిందే!
పెళ్లి ఇలా..!
ఇంట్లోంచి వెళ్లిపోయిన గాయత్రి, స్వామితో విజయవాడ, గుంటూరులో కొద్ది రోజులు గడిపింది. అటు తిరిగి.. ఇటు తిరిగి చివరికి వేములవాడకు వచ్చి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అన్నారంలో ఉన్న షరీప్‌కు ఇద్దరు వచ్చి ఒక అద్దె గది తీసుకున్నారు. ఇక్కడే ఇద్దరికీ అసలు అవగతం అయ్యింది. ఇంటి నుంచి.. సభ్య సమాజం నుంచి ఎలాంటి ఒత్తిడి వస్తుందో..? అసలు బయటికి వెళ్ళి బతికే పరిస్తితి ఉందా? అని తప్పు తెలుసుకుని మదనపడ్డారు. దీంతో ఇక చేయడానికి వేరే ఆప్షన్ లేక.. ఎలాగో ఈ బంధం నిలబడదని స్వామి ఆత్మహత్యకు ప్రేరేపించగా, ఇద్దరూ గడ్డి మందు తాగారు. స్వామి అక్కడిక్కడే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న గాయత్రిని రూమ్ ఓనర్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించాడు. ఐతే గాయత్రి తల్లిదండ్రులకు రూమ్ ఓనర్ సమాచారం ఇవ్వగా.. ఆసుపత్రికి వెళ్లిన తండ్రితో, ‘ నాన్న నన్ను బ్రతికించు, నాకు చచ్చిపోవాలని లేదు’ అంటూ గాయత్రి ప్రాణాలు విడిచింది.
Also Read- Ariyana Glory: బెడ్ రూమ్ లో మా బావ మరో అమ్మాయితో అలాంటి పని.. చూసి బ్రేకప్ చెప్పా.. బిగ్ బాస్ బ్యూటీ
ఎందుకిలా..?
ఈ ఘటన ప్రేమ వ్యవహారాలు, వయసు వ్యత్యాసం, కుటుంబ ఆమోదం లేకపోవడం వంటి అంశాలు ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో తెలియజేస్తోంది. ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదని, కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం కోరాలని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. వయసు వ్యత్యాసం, సామాజిక ఆమోదం లేకపోవడం.. కుటుంబ సమస్యలు ఇరువర్గాల నుంచి వ్యతిరేకత రావడం, భవిష్యత్తుపై అభద్రత.. తీవ్రమైన ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఆత్మహత్యకు దారితీసే ప్రధాన కారణాలలో ఒకటి అని చెప్పుకోవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు