Mowgli 2025: ‘కలర్ ఫోటో’ సినిమాతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రాజ్. తెలుగులో నటుడిగా, రచయితగా కూడా కొన్ని సినిమాలు చేశారు. ‘కలర్ ఫోటో’ తర్వాత దర్శకుడు సందీప్ రాజ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. ఈ సినిమా తెలుగు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రాబోతున్న ఈ సినిమాలో రోషన్ కనకాల, సాక్షి సాగర్ మడోల్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాల భైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫర్‌గా రామ మారుతి వ్యవహరిస్తుండగా, పవన్ కళ్యాణ్ కోదాటి ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
Read also- Telugu States: తెలుగు రాష్ట్రాల మధ్య తెగని బనకచర్ల పంచాయితీ!
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక గిరిజన యువకుడు అయిన రోషన్ కనకాల(హీరో) చిన్నప్పనుంచీ అడవిలో పెరుగుతాడు. అదే తండాలో ఉండే సాక్షి సాగర్ మడోల్కర్(హీరోయిన్)తో హీరోకు చిన్నప్పటి స్నేహితురాలు. హీరోయిన్ కు మూగ, చెవిటి కావడంతో హీరో ఆమె వెనకాల తిరుగుతూ ఉంటాడు. హీరోయిన్ కు మాత్రం హీరో అంటే ఇష్టం ఉండదు. నా వెనకాల తిరగొద్దు అంటూ హీరోను తిడుతూ ఉంటుంది. హీరో మాత్రం చిన్నప్పుడు ఆమె తల్లికి ఇచ్చిన మాటకోసం ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. హీరోయిన్ చిన్నప్పుడే ఆమె తల్లి చనిపోతుంది. ఆమె చనిపోయే సమయంలో దగ్గరలో ఉన్న హీరోకు తన కుమార్తెను నువ్వే చూసుకోవాలి అని చెప్పి చనిపోతుంది. అందుకే హీరో ఆమెతోనే ఉంటాడు. కొంత కాలానికి ఆ తండా లోకి విలన్ అయిన బండి సరోజ్ కుమార్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా వస్తాడు. హీరోయిన్‌కు ఎవరూ లేరని తెలుసుకుని ఆమెను ఎలాగైనా వశపరుచుకోవాలని చూస్తాడు.
హీరోయిన్ ఎక్కడకు వెళ్లినా విలన్ ఆమెను వెంటాడుతూ ఉంటాడు. అది ఆమెకు మాత్రం తెలియదు. ఇది గమనించిన హీరో, విలన్ చేస్తుందంతా హీరోయిన్‌కు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. హీరోయిన్ అయితే ఇదంతా హీరో కావాలని చేస్తున్నాడని అనుకుంటుంది. హీరో ఎంత చెప్పినా వినిపించుకోదు. విలన్ మాత్రం ఆమెను మరింత దగ్గరగా పరిశీలిస్తూ ఉంటాడు. హీరోకు మాత్రం జరుగుతున్నది అంతా తెలిసినా ఏం చెయ్యలేకపోతాడు. హీరోకు ఓ ఉపాయం తట్టి ఆ తండాలోని పెద్దమనుషులతో మాట్లాడి హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో విలన్ ఆగడాలు ఆగుతాయనుకుంటాడు హీరో. పెళ్లికి అంతా సిద్ధం అవుతుంది. తాళికట్టే సమయంలో హీరోయిన్ తనకు ఈ పెళ్లి ఇష్టం లేనట్టుగా ఏడుస్తుంది. అదే సమయంలో హీరోపై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చెయ్యడానికి వస్తాడు విలన్.
Read also- Nimisha Priya: ఆఖరి ‘నిమిష’లో ఊహించని ట్విస్ట్.. మళ్ళీ మొదటికి!
హీరోను అరెస్టు చేసి లోపలేస్తాడు. తన లైన్ క్లియర్ అయిందనుకుంటాడు విలన్. అప్పటి నుంచి హీరోయిన్ వెనకాల ఇష్టం వచ్చినట్లు తిరుగుతాడు. చాలా రోజులకు హీరోయిన్‌కు ఫారెస్ట్ ఆఫీసర్ మీద అనుమానం వస్తుంది. దీంతో హీరోయిన్ ఏమీ చేయ్యలేని స్థితిలో ఉండిపోతుంది. ఓ రోజు ఫారెస్ట్ ఆఫీసర్ ఆగడాలు మరీ మితిమీరిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరో కనిపించకుండా విలన్‌ను ఎదిరించడానికి హీరోయిన్‌కు సాయపడుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో ఆమెకు హీరో ఎదురవ్వాల్సి వస్తుంది. అప్పటి నుంచి హీరోను హీరోయిన్ ఇష్ట పడటం మొదలవుతోంది. హీరోకు అడవి బాగా తెలియడంతో హీరో, హీరోయిన్ కలిసి విలన్‌ను అడవిలో ఆటపట్టిస్తూ ఉంటారు.
హీరో, హీరోయిన్, విలన్ వీరి ముగ్గురి మధ్య కొన్ని సన్నివేశాలు జరిగిన తర్వాత విలన్‌కు అనుమానం వస్తుంది. హీరో అసలు స్టేషన్లో ఉన్నాడా లేదా అని. దాంతో కంగారుగా స్టేషన్ కు వెళ్లి చూసుకుంటాడు. అక్కడ హీరో ఉండడు ఏం జరిగిందని విలన్ ఆరా తియ్యగా.. హీరో కోసం కొన్ని విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. హీరోకు చిన్నప్పటి నుంచీ ఫారెస్ట్ ఉన్నతాధికారితో పరిచయం ఉంటుంది. అడవిలో జరిగే సమాచారం ఆ అధికారి వచ్చినపుడల్లా చెబుతుంటాడు. సడన్‌గా అధికారి బదిలీ అవడంతో హీరో ఏం తోచని స్థితిలో ఉండిపోతాడు. అదే సమయంలో పనిమీద ఆ స్టేషన్‌కు వెళ్లిన ఫారెస్ట్ ఉన్నతాధికారికి హీరో జరిగిందంతా చెబుతాడు. ఫారెస్ట్ ఉన్నతాధికారి హీరోను విడిపించి హీరోయిన్‌ను కాపాడమంటాడు. అలా హీరో బయటకు వస్తాడు. కోపంతో రగిలిపోతున్న విలన్ హీరోను ఎలాగైనా చంపాలనుకుంటాడు.
హీరో కోసం అడవి అంతా తిరుగుతుండగా హీరో ఓ చోట తారసపడతాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. అందులో హీరో గాయాలపాలై చావుబతుకుల స్థితిలోకి వెళ్లిపోతాడు. అదే సమయంతో అక్కడకు ఓ పులి రావడంతో ఎలా తప్పించుకోవాలో తెలిసిన హీరోయిన్ హీరోను రక్షిస్తుంది. విలన్ పులికి ఆహారం అయిపోతాడు. తర్వాత హీరోను తండాకు తీనుకెళ్లి గాయాలు మానిన తర్వాత పెళ్లి చేసుకుంటుంది హీరోయిన్.