Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, గత ఏడాది పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2024 జనవరిలో వీరి 14 ఏళ్ల వైవాహిక జీవితం గుడ్ బై చెప్పిన తర్వాత, షోయబ్ మాలిక్ పాకిస్థానీ నటి సనా జావేద్‌ను రెండో వివాహం చేసుకున్నారు. అయితే, సానియా మీర్జా తన కుమారుడు ఇజ్హాన్ మీర్జా మాలిక్‌తో దుబాయ్‌లో నివసిస్తూ, తన కెరీర్ పై దృష్టి సారించింది. రెండో పెళ్లి గురించి ఆమె ఎలాంటి ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. కానీ, సోషల్ మీడియాలో సానియా రెండో వివాహం రక రకాల వార్తలు వస్తున్నాయి.
Also Read: Pranava One HSEL: సోమాజిగూడ హెచ్‌ఎస్ఈఎల్ భవనంపై తప్పుడు సర్టిఫికేట్.. అధికారులకు ఫిర్యాదు!
ఆ తెలుగు హీరోని రెండో పెళ్లి చేసుకోబోతుందా?
ఇటీవల, సానియా మీర్జా సోషల్ మీడియాలో ఒక కాఫీ షాప్‌లో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమె కాఫీ కప్‌తో కనిపించింది, కానీ ఆమెతో పాటు వేరే ఉన్నారనే టాక్ నడుస్తుంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. నెటిజన్లు ఈ ఫోటోను చూసి, సానియా ఒక తెలుగు హీరోతో “కాఫీ డేట్”కు వెళ్లిందని, త్వరలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందని రూమర్స్ వినిపిస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఈ పోస్ట్ కింద కామెంట్లు చేస్తూ, ఆమె తెలుగు సినీ పరిశ్రమలోని ఒక స్టార్ హీరోతో డేటింగ్‌లో ఉందని, పెళ్లి కూడా పక్కా చేసుకుంటుందని అంటున్నారు.
కాఫీ షాప్ లో సానియాతో ఎవరున్నారు?
కొన్ని నెలల క్రితం సానియా మీర్జా ఒక ప్రముఖ క్రికెటర్‌తో రెండో వివాహం చేసుకోబోతుందనే వార్తలు వచ్చాయి, కానీ ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా ఆ వార్తలను “ఫేక్ న్యూస్” అంటూ కొట్టిపారేశారు. అయినప్పటికీ, తాజా కాఫీ షాప్ ఫోటోతో సానియా మీర్జా మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, “సానియా రెండో పెళ్లి ఎవరితో? తెలుగు హీరో ఎవరు?” అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
Also Read: Ghanpur Project: 4 రోజుల్లో ఘనపూర్ ప్రాజెక్ట్‌కు నీరు విడుదల చేయాలి.. లేకుంటే రైతులతో ధర్నా