Sant Tukaram( image source: X)
ఎంటర్‌టైన్మెంట్

Sant Tukaram: విడుదలకు సిద్ధమైన ‘సంత్ తుకారం’… ఎప్పుడంటే?

Sant Tukaram: పాన ఇండియా స్టాయిలో భక్తి చిత్రాల హవా ప్రస్తుతం తగ్గిందనే చెప్పాలి. అలాంటి సమయంలో విడుదల కాబోతున్న చిత్రం ‘సంత్ తుకారాం’.కర్జన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుబోధ్ భావే హీరోగా ఆదిత్య ఓం తెరకెక్కించిన చిత్రం ‘సంత్ తుకారాం’. ఈ సినిమా జూలై 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా ఆదిత్య ఓం ఎన్నో సినిమాలు చేసిన ప్రేక్షకులను మెప్పి్ంచారు. ఇక ఇప్పుడు ‘సంత్ తుకారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 17వ శతాబ్దపు మరాఠీ సాధువు కవి భక్తిని ప్రతిఘటనగా మార్చిన సంత్ తుకారాం జీవితం, వారసత్వం, సాహిత్య విప్లవం ఆధారంగా ఆదిత్య ఓం ఈ ‘సంత్ తుకారం’ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో ప్రముఖ మరాఠీ నటుడు సుబోధ్ భావే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే మరాఠీ, హిందీ సినిమాల్లో భావే తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించారు. ఇప్పుడు 17వ శతాబ్దపు సాధువైన సంత్ తుకారం పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ ను మూవీ టీం విడుదల చేశారు.

Also Read- Kota vs Anasuya: కోట, అనసూయల మధ్య గొడవేంటి? కోటను అంతమాట అందా?

ఈ చిత్రంలో శివ సూర్యవంశీ, షీనా చోహన్, సంజయ్ మిశ్రా, అరుణ్ గోవిల్, శిశిర్ శర్మ, హేమంత్ పాండే, గణేష్ యాదవ్, లలిత్ తివారీ, ముఖేష్ భట్, గౌరీ శంకర్, ట్వింకిల్ కపూర్, రూపాలి జాదవ్, జేడీ అక్బర్ సామి వంటి ప్రఖ్యాత నటులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకి హైలెట్ కానుంది. నిఖిల్ కామత్, రవి త్రిపాఠి, వీరల్, లావన్ స్వరపరిచిన పాటలు శాస్త్రీయ, జానపద, భక్తి భావాల్ని కలిగించేలా ఉండనున్నాయి. ప్రతి పాట తుకారాం పాత్ర భావోద్వేగ, తాత్విక పరిణామాన్ని ప్రతిధ్వనిస్తుంది. పురుషోత్తం స్టూడియోస్‌తో కలిసి బి. గౌతమ్‌కు చెందిన కర్జన్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read- Virgin Boys: సినిమా సమీక్షకుడిపై నిర్మాత ఫైర్.. స్పందించిన పుచుక్ పుచుక్!

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. చాలా కాలం తర్వాత మంచి భక్తి సినిమా రావడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విడుదలైన పాటలు వింటుంటే భక్తి పారవశ్యంలో మునిగి తేలినట్టుగా ఉన్నాయని సంగీత ప్రియులు చెబుతున్నారు. ఇంతిలా ప్రేక్షకాదరణ పొందిన సినిమా విడుదల కోసం సగటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. సినిమాలో మంచి సాహిత్యం ఉండటంతో మంచి సినిమా అవుతుందని సినీ పెద్దలు చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు