War 2: ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో నటించిన చిత్రం ‘వార్ 2’. ఈ చిత్రంలో ఎన్టీఆర్ (Jr NTR)తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అశుతోష్ రాణా, అనిల్ కపూర్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. 2019లో వచ్చిన ‘వార్’ చిత్రానికి సీక్వెల్. ‘వార్ 2’ చిత్రం ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ చిత్రంలో హృతిక్ పాత్ర అటుంచితే మన తెలుగోడు ఎన్టీఆర్ పాత్రపై మాత్రం భారీగానే అంచనాలు, అంతకుమించి ఊహాగానాలు ఉన్నాయి. తొలిసారి బాలీవుడ్ సినిమాలో నటిస్తుండటంతో బుడ్డోడి పాత్ర ఎలా ఉంటుంది? మూవీలో ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? ఎంతసేపు సినిమాలో ఉంటాడు? అంత పెద్ద యాక్టర్‌ను తీసుకున్న తర్వాత అయాన్ ముఖర్జీ.. ఎన్టీఆర్ న్యాయం చేశాడా? లేదా? ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని అనుమానాలు అభిమానులు, టాలీవుడ్ సినీ ప్రియుల్లో వస్తున్నాయి. ఈ సందర్భంగా ‘స్వేచ్ఛ’ కు ఉన్న సోర్స్ ప్రకారం ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని సేకరించింది.
Read Also-Pawan Kalyan: చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్!
ఫుల్ డీటైల్స్ ఇవిగో..
‘వార్ 2’ సినిమా ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత జూనియర్ ఎంట్రీ ఉంటుంది. అక్కడ్నుంచి సినిమా చివరి వరకూ బుడ్డోడు కనిపిస్తాడని ఎక్స్‌క్లూజివ్‌గా సమాచారం అందినది. అంతేకాదు.. హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరికీ ఒక పాట ఉంటుందని తెలిసింది. సినిమాలో హృతిక్-ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్సులు విజువల్ వండర్స్‌లా ఉంటాయని, ఆరు భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయని సమాచారం. సినీ ప్రియులు, సినీ విశ్లేషకుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే ఎన్టీఆర్ పాత్ర విలన్‌లాగా ఉందని చెబుతున్నారు. అయితే ఇది పూర్తిస్థాయి విలన్ పాత్ర కాకపోవచ్చు, కానీ హృతిక్ రోషన్ పాత్రకు ధీటైన, సవాలు విసిరే పాత్రగా ఉంటుందని చెబుతున్న పరిస్థితి. వీరిద్దరి మధ్య తీవ్రమైన గొడవలు, యాక్షన్ సన్నివేశాలు ప్రధానంగా ఉంటాయని అంటున్నారు. ఎన్టీఆర్ పవర్‌ఫుల్, అత్యంత తెలివైన ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. హృతిక్ రోషన్‌ను టెక్నికల్‌గా, వ్యూహాత్మకంగా ఎదుర్కొనే పాత్ర అని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ మాస్, స్టైలిష్ మేకోవర్‌తో కనిపించిన విషయాన్ని ట్రైలర్, ఫొటోల్లో చూడొచ్చు. నిజంగా ఆయన బాడీ లాంగ్వేజ్, ఫైటింగ్ స్టైల్ కొత్తగా ఉన్నాయని అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. మొత్తమ్మీద ఎన్టీఆర్ పాత్రలో యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయని చిత్ర యూనిట్ నుంచి ఇప్పటికే లీకులొచ్చాయి. హృతిక్‌తో కలిసి చేసే ఫైట్ సీక్వెన్సులు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చిత్రబృందం చెబుతున్నది.
Read Also- Wife And Husband: వామ్మో తెలంగాణలో ఘోరం.. భార్యభర్తల పంచాయితీలో ఇద్దరు దారుణ హత్య
ఎదురుచూపుల్లో..!
వాస్తవానికి సినిమాలో మొదట ఎన్టీఆర్ పాత్ర చిన్నదేమోనని కొందరు భావించారు. కానీ చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ పాత్ర చాలా బలంగా, కథలో కీలక మలుపులకు కారణమయ్యేదిగా ఉండబోతోందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం అతిథి పాత్ర కాదని, హృతిక్‌కు సమానమైన వెయిటేజ్ ఉన్న పాత్ర అని చెబుతున్నారు. మొత్తంగా.. ‘వార్ 2’లో ఎన్టీఆర్ పాత్ర కేవలం విలన్‌గానే కాకుండా, చాలా షేడ్స్ ఉన్న, బలమైన, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. ఆయన బాలీవుడ్ ఎంట్రీకి ఇది సరిగ్గా సెట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా, చిత్ర ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా ప్రారంభం కాలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత సితార నాగవంశీ రైట్స్ దక్కించుకోగా.. ఎన్టీఆర్ ఎంట్రీ థియేటర్లలో స్క్రీన్లు చిరిగిపోయేలా ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా బడ్జెట్ రూ.200 నుంచి 400 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులలో ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం కావడం, హృతిక్ రోషన్‌తో కలిసి నటించడం అభిమానుల్లో, సినీ ప్రియుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతోంది.
Read Also- Health News: రాత్రిపూట స్మార్ట్ ఫోన్లు వాడితే మీ పని గోవిందా.. ఎందుకో రండి చెబుతా!