Star Heroine: కేరళలోని ఓ టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా చిన్న పాత్రతో కెరీర్‌ను ప్రారంభించిన ఓ అమ్మాయి, ఇప్పుడు దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ‘లేడీ సూపర్‌స్టార్’గా హవాను కొనసాగిస్తోంది. ఆమె ఎవరో కాదు, స్టార్ హీరోయిన్ నయనతార. అందం, నటన, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన ఈ స్టార్ హీరోయిన్, తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది.
Also Read: Telugu Cinema: షూటింగ్లో అలాంటి పాడు పని చేసినందుకు హీరోని చెప్పుతో కొట్టిన స్టార్ హీరోయిన్?
నయనతార కెరీర్ ఆరంభం ఒక టీవీ యాంకర్‌గా, ఆ తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టి, వెండితెరపై హీరోయిన్‌గా మెరిసింది. తెలుగు, తమిళ సినిమాల్లో వరుస విజయాలతో స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఐదు, ఆరేళ్లు కొనసాగడమే గొప్ప విషయం, కానీ నయన్‌కు ఈ లెక్కలు వర్తించవు. నలభై ఏళ్ల వయసు దాటినా, ఆమె డిమాండ్ ఇప్పటికీ తగ్గలేదు. స్టార్ హీరోల సరసన నటిస్తూ, అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది.
Also Read: Telugu Cinema: షూటింగ్లో అలాంటి పాడు పని చేసినందుకు హీరోని చెప్పుతో కొట్టిన స్టార్ హీరోయిన్?
తెలుగు, తమిళం మాత్రమే కాదు, బాలీవుడ్‌లోనూ తన సత్తాను చూపిస్తూ విజయాలను నయన్ అందుకుంది. అంతేకాదు, నటిగా, నిర్మాతగా, యాడ్ షూట్స్‌లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవల టాటా స్కై యాడ్ కోసం 50 సెకన్ల షూట్‌కు ఏకంగా రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని సంచలనం సృష్టించింది. అంటే, సెకనుకు రూ. 10 లక్షలు అన్నమాట. అంతే కాదు, సొంత ప్రైవేట్ జెట్‌ను కలిగి ఉన్న ఏకైక భారతీయ హీరోయిన్‌గా కూడా నయన్ రికార్డు సృష్టించింది.
Also Read: Kota Srinivas Rao Death: కోట శ్రీనివాసరావు మృతికి వాళ్లే కారణమా? అవకాశాలు అడిగినా ఇవ్వలేదా?