Ponnam Prabhakar (Image Source: Twitter)
తెలంగాణ

Ponnam Prabhakar: ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ స్థంస్థగత పునఃనిర్మాణం పై తుది కసరత్తు

Ponnam Prabhakar :  ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పై గాంధీ భవన్ లో పీసీసీ జిల్లా ఇంచార్జి పొన్నం ప్రభాకర్ కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిద్దిపేట,సంగారెడ్డి ,మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, పార్లమెంట్ ఇంచార్జి లు ,నియోజకవర్గ ఇంచార్జీలు, జనరల్ సెక్రెటరీలు , అబ్జర్వర్లతో పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 11 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నేతలు ,మండల అధ్యక్షుల రేసులో ఉన్న ఆశావహులు ,జిల్లా కార్యవర్గం ఆశావహులు , అనుబంధ సంఘాల ఆశావాహులతో మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు. పార్టీలో కష్టపడిన వారికే పదవులు వస్తాయని తెలిపారు. ముందు నుండి పార్టీలో యాక్టివ్ గా ఉన్న వారికి మండల అధ్యక్షుల రేసులో అవకాశాలు వస్తాయని తెలిపారు. ఎఐసిసి తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో ఈనెల 15 లోపు సంస్థాగత నిర్మాణం పూర్తి చేసేలా తుది కసరత్తు నిర్వహించారు.అందులో బాగంగా గ్రామ శాఖ అధ్యక్షుల నుండి వార్డు ,బ్లాక్ అధ్యక్షులు ,మండల శాఖ అధ్యక్షులు ,జిల్లా కార్యవర్గం,అనుబంధ సంఘాల నియామకం పూర్తి చేసేలా ముఖ్య నేతలతో దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గ ఇంచార్జీలు ఇచ్చిన షార్ట్ లిస్ట్ పై కసరత్తు పూర్తి చేసి పీసీసీ , ఎఐసిసి ఇంచార్జి లకు పంపించనున్నారు.

Also Read: B Saroja Devi: అమ్మకి ఇచ్చిన మాట కోసం వాటికి దూరంగా ఉంది.. ఇప్పుడున్న హీరోయిన్స్ అయితే పాటించేవాళ్లే కాదు?

మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పోస్టులు త్వరలోనే పూర్తి అయ్యేలా కసరత్తు జరుగుతుందని పార్టీ కోసం పని చేసిన వారందరికీ అవకాశాలు వస్తాయని వెల్లడించారు. నామినేటెడ్ పోస్టుల్లో బాగంగా చాలా మండలాల్లో మార్కెట్ కమిటీ లు ,పట్టణ అభివృద్ధి కమిటీ లు ,దేవాలయ కమిటీ లు ,తదితర పెండింగ్లో ఉన్న వాటిపై ఈ నెలాఖరు లోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ప్రతి గ్రామగ్రామాన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా నేతలు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం చారిత్రాత్మకంగా తీసుకున్న నిర్ణయం బీసీ లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిందని దీని ద్వారా కొత్త నాయకత్వానికి కూడా అవకాశాలు వస్తాయని వెల్లడించారు. సర్పంచ్, ఎంపీటీసీ , జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటి నుండే పని చేయాలని ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వంలో సంక్షేమం ,అభివృద్ధి ముందుకు పోతుందని రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ ,రైతు భరోసా , సన్న బియ్యం పంపిణీ, సన్న వడ్ల కి 500 బోనస్ , కొత్త రేషన్ కార్డులు పంపిణీ ,60 వేల ఉద్యోగాలు భర్తీ ,200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్,ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఆరోగ్య శ్రీ 5-10 లక్షలకు పెంపు ,కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పథకాలు ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని వీటికి గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. కింది స్థాయిలో నేతలు ప్రభుత్వం, పార్టీ సమన్వయం చేసుకొని పని చేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని దిశా నిర్దేశం చేశారు.

Also Read: Gadwal District: రోడ్డుపై ఏరులై పారుతున్న మురుగు నీరు.. పట్టించుకోని అధికారులు

సమీక్షా సమావేశం లో మూడు జిల్లా డిసిసి అధ్యక్షులు , తుంకుంట నర్సారెడ్ , ఆంజనేయులు గౌడ్,పార్లమెంట్ ఇంచార్జి ఉపాధ్యక్షులు బండి రమేష్ , నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్ ,జనరల్ సెక్రెటరీలు జగదీశ్వర్ గౌడ్ , ధరా సింగ్ , ఉప్పల్ శ్రీనివాస్ గుప్త,నందిమల్ల యాదయ్య, చనగాని దయాకర్ ,అసదుద్దీన్ , అబ్జర్వర్లు మెట్టు సాయి కుమార్ ,పవన్ మల్లాది తదితరులు పాల్గొన్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?