Bonalu festival: బోనాల పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ (C.V.Anand) తోపాటు పలువురు ఐపీఎస్ ( IPS) అధికారులు దర్శించుకున్నారు. ప్రతీసారిలానే ఈ యేడాది కూడా సికింద్రాబాద్ (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో అమ్మవారిని దర్శించి బోనాలు సమర్పించటంతోపాటు మొక్కులు చెల్లించుకోవటానికి నగరం నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు.
Also Read: BC reservation bill: బీసీ రిజర్వేషన్ ను 9వ షెడ్యూల్ లో చేర్చాలి.. మాజీ మంత్రి డిమాండ్
క్యూ లైన్లను ఏర్పాటు
గత సంవత్సరం కొన్ని సమస్యలు ఎదురైన నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితి ఏర్పడకుండా అధికార యంత్రాంగాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. అదనంగా క్యూ లైన్లను ఏర్పాటు చేయటంతోపాటు భక్తుల కోసం మంచినీళ్లు తదితర వసతులను కల్పించాయి. అదే సమయంలో జేబు దొంగలు, స్నాచర్లు, ఈవ్ టీజర్లకు అడ్డుకట్ట వేయటానికి పోలీసు ఉన్నతాధికారులు క్రైం, షీ టీంల సిబ్బంది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
భద్రతా ఏర్పాట్లు
ఇక, ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న తరువాత కమిషనర్ ఆనంద్ దేవాలయం వద్ద ఉన్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్, నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ అపూర్వ రావు, డీసీపీ డీడీ శ్వేత, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెడ్గే, హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షిన కృష్ణమూర్తి, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్, టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తదితరులు ఉన్నారు.
Also Read: KTR on Congress: పాలన అంటే శంకుస్థాపనలు కాదు కేటీఆర్ సంచలన కామెంట్స్!