Drug Peddlers( image credit: free pic)
తెలంగాణ

Drug Peddlers: డెడ్‌డ్రాప్ ద్వారా సరుకు డెలివరీ.. డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలని సీఎం ఆదేశాలు

Drug Peddlers: పోలీసులకు చిక్కకుండా డ్రగ్ పెడ్లర్లు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. దీని కోసం డెడ్ డ్రాప్ పద్దతిని అమలు చేస్తున్నారు. మరి కొన్నిసార్లు కొరియర్ సంస్థల ద్వారా మాదక ద్రవ్యాలను చేర వేస్తున్నారు. దీంతో వీరిని పట్టుకోవడం సిబ్బందికి కష్టసాధ్యంగా మారుతున్నది. చాలా కేసుల్లో డ్రగ్స్ సేవిస్తున్న వారు, వారి ద్వారా వీటిని కొంటున్నవారు దొరుకుతున్నారు తప్పితే వ్యవస్థీకృతంగా ఈ దందాను సాగిస్తున్న ప్రధాన పెడ్లర్లు మాత్రం పట్టుబడడం లేదు. తప్పించుకుని తిరుగుతూ మాదక ద్రవ్యాల దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)  పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ లక్ష్య సాధనకు ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే మాదక ద్రవ్యాల మహమ్మారిని నిర్మూలించేందుకు ఈగల్ టీంను (Eagle Team) సైతం ఏర్పాటు చేశారు. ఇక, యాంటీ నార్కొటిక్ వింగ్ పోలీసులతోపాటు ఈగల్ టీం అధికారులు తరచూ దాడులు జరుపుతూ డ్రగ్స్ సేవిస్తున్న వారిని, వారితో కలిసి మాదక ద్రవ్యాల పార్టీలు చేసుకున్న వారిని కూడా పట్టుకుంటున్నారు. అయితే, అడిగినప్పుడల్లా వీరికి డ్రగ్స్ సప్లయ్​ చేస్తున్న పెడ్లర్లు మాత్రం పోలీసుల (Police)  చేతికి చిక్కడం లేదు. దీనికి కారణం దొరకకుండా ఉండడానికి డ్రగ్ పెడ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూట్లలో దందా సాగిస్తుండడమే అని అధికారులు చెబుతున్నారు.

Also Read: Kota Srinivasa Rao: రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన కోట.. 2015లో పద్మశ్రీ పురస్కారం

డెడ్ డ్రాప్​ పద్దతిని ఉపయోగిస్తున్న పెడ్లర్లు
పోలీసులకు దొరకకుండా ఉండేందుకు పెడ్లర్లు ప్రధానంగా డెడ్ డ్రాప్​ పద్దతిని ఉపయోగిస్తున్నారని నార్కొటిక్ వింగ్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఈ పద్దతిని గతంలో మన దేశ గూఢచారులు ఉపయోగించే వారన్నారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని మన దేశ గూఢచారులు శత్రు దేశాల్లో రహస్య ఆపరేషన్లు నిర్వహించే విషయం తెలిసిందే. ఈ క్రమంలో కీలక వివరాలు చేతికి చిక్కినప్పుడు గూఢచారులు తమ సహచరులకు డెడ్ డ్రాప్ పద్దతి ద్వారా వాటిని అందచేసేవారు.

సేకరించిన వివరాలతో ఉన్న డాక్యుమెంట్లు కవర్లలో పెట్టి నిర్ణయించుకున్న చోటులో పెట్టి ఆ ప్రదేశాన్ని ఫొటో తీయడం, లేదా వాట్సాప్ లొకేషన్ పెట్టటం ద్వారా సహచరులకు అందించేవారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే సమాచారాన్ని అందించిన వారికి, దానిని తీసుకున్న వారికి మధ్య ఎలాంటి పరిచయాలు కూడా ఉండక పోవడం. ప్రస్తుతం డ్రగ్ పెడ్లర్లు ఇదే దారిలో మాదక ద్రవ్యాల దందాను చేస్తున్నారు. కొనుగోలుదారులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని, టెలిగ్రాం తదితర యాప్‌ల ద్వారా ఆర్డర్లు తీసుకుని ఆయా నగరాలకు ముఠా సభ్యులతో డ్రగ్స్‌ను చేరవేస్తున్నారు. వీళ్లు పెద్దగా పోలీసు నిఘా ఉండని ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఆయా చోట్ల మాదక ద్రవ్యాల ప్యాకెట్లను పెడుతున్నారు. ఆ తరువాత వాట్సాప్ లొకేషన్​‌ను కొనుగోలుదారులకు పంపిస్తున్నారు. ఆ వెంటనే కొనుగోలుదారులు వచ్చి డ్రగ్స్ తీసుకుని వెళ్తున్నారు.

కొరియర్ సంస్థల ద్వారా దందా
డ్రగ్ పెడ్లర్లు కొరియర్ సంస్థల ద్వారా కూడా తమ దందాను కొనసాగిస్తున్నట్టు నార్కొటిక్ వింగ్‌కు చెందిన అధికారి చెప్పారు. గృహోపకరణాలు, బొమ్మలు, చెప్పులు ఇలా రకరకాల వస్తువుల్లో మాదక ద్రవ్యాలను దాచి పెట్టి కొరియర్ సంస్థల ద్వారా కొనుగోలు దారులకు పంపిస్తున్నారన్నారు. ఇటీవల పట్టుబడ్డ మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యకు ఇదేవిధంగా డ్రగ్స్ చేరాయని చెప్పారు. మహిళలు ధరించే హై హీల్స్ సైండిళ్ల అడుగు భాగంలో ప్రత్యేకంగా తయారు చేయించిన అరల్లో డ్రగ్స్ ప్యాకెట్లు పెట్టి పెడ్లర్లు వాటిని సూర్యకు పంపించారని తెలిపారు. ఇక, మాదక ద్రవ్యాల దందాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కింగ్ పిన్‌లు ఎక్కువ రోజులు ఎక్కడా ఉండదని చెప్పారు. ప్రతీ రెండు మూడు నెలలకొకసారి మకాం మారుస్తూ ఈ అక్రమ దందాను చేస్తున్నారని వివరించారు. దీనివల్ల డ్రగ్స్ దందాలో అసలు సూత్రధారుల పేర్లు తెలిసినా వారిని పట్టుకోవడం సాధ్యపడడం లేదని వివరించారు.

 Also Read: BRS: పార్టీ నేతలను వెంటాడుతున్న కేసులు.. నైరాశ్యంలో గులాబీ క్యాడర్..

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ