Raja Singh: బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ కు భవిష్యత్ లో సవాళ్లు తప్పవా? ముళ్ల బాటలోనే ఆయన పయనం సాగించే పరిస్థితి ఏర్పడనుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎందుకంటే రాజాసింగ్(Raja Singh) కు పొలిటికల్ గా, పర్సనల్ గా సవాళ్లు తప్పవని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా భవిష్యత్ లో ఆయన తెలంగాణ(Telangana) రాజకీయాల్లో కొనసాగుతారా? లేక మరోచోటకు వెళ్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే ఆయన పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది ఏ పార్టీ అయి ఉంటుందనే ప్రశ్న హిందుత్వవాదుల మెదళ్లను తొలిచివేస్తోంది. అయితే.. తాను పార్టీ మారినా తనను ఎవరూ భరించే పరిస్థితి లేదని ఆయనే పలుమార్లు చెప్పిన సందర్భాలున్నాయి. దీంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది సస్పెన్స్ గా మారింది.
ఎన్నోసార్లు బెదిరింపు కాల్స్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ9BJP)కి రాజీనామా లేఖ అందించి రాజాసింగ్ పెద్ద తప్పిదమే చేశారనే చర్చ అటు శ్రేణులతో పాటు పొలిటికల్(Political) సర్కిల్స్ లోనూ విపరీతంగా జరుగుతోంది. పార్టీ తనను వదులుకోదనే ఓవర్ కాన్ఫిడెన్సే ఆయన కొంప ముంచిందని చర్చించుకుంటున్నారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే రిజైన్ లెటర్ ఇచ్చారా? అని చెవులు కొరుక్కుంటున్నారు. ఇదిలా ఉండగా హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా రాజాసింగ్ కు పేరుంది. ఆ కారణంగానే ఆయన్ను పలు వర్గాలకు టార్గెట్ గా మారారు. ఇప్పటికే ఆయనకు ఎన్నోసార్లు బెదిరింపు కాల్స్(Threatening calls) వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఈ అంశం ఆయనకు సవాల్ గా మారనుందని చర్చించుకుంటున్నారు. పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసినా హిందుత్వ, జాతీయ వాదం కోసం పనిచేస్తూనే ఉంటానని ఆయన స్పష్టంచేయడం గమనార్హం.
Also Read: Operation Baam: బలూచిస్థాన్‌లో ఆపరేషన్ బామ్.. పాక్‌లో అల్లకల్లోలం
ఆయనను ఓటర్లు ఆదరిస్తారా? లేదా?
రాజాసింగ్ భవిష్యత్ లో తెలంగాణ రాజకీయాల్లో ఉంటారా? లేదా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ(BJP) తరుపున గెలిచిన ఆయన పార్టీ రాజీనామా అనంతరం పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అదే జరిగితే ఆ స్థానానికి బైపోల్ అనివార్యమవుతుంది. అప్పుడు తిరిగి ఆయన ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తారా? లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? అనే చర్చ సైతం జోరుగా సాగుతోంది. అలా అయితే గోషామహల్ ప్రజలు మళ్లీ ఆదరిస్తారా? లేదా? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారనుంది. ఎందుకంటే బీజేపీ, హిందుత్వవాదం ఆయనకు కలిసొచ్చింది. బీజేపీ లేకుంటే ఆయనను ఓటర్లు ఆదరిస్తారా? లేదా? అనే అంశంపైనా చర్చ జరుగుతోంది. రాజాసింగ్ పార్టీకి రాజీనామా అందిచిన సమయంలో తనను డిస్ క్వాలిఫై చేయాలని స్పీకర్ కు లేఖ రాయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలిపారు. అనంతరం దీనిపై పార్టీ సైతం క్లారిటీ ఇచ్చింది. ఆయన తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్వయంగా వెళ్లి స్పీకర్ కు అందించాలని ఘాటుగా సూచించింది.
తెలంగాణ పాలిటిక్స్‌లో ఉంటారా
ఇదిలా ఉండగా తనను ఏ పార్టీ భరించలేదని చెబుతున్న రాజాసింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆయనకు మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన హిందుత్వ పార్టీల నుంచి ఆఫర్ ఉందని రాజాసింగ్ స్వయంగా వెల్లడించారు. అయితే అది ఏ పార్టీ అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీని ప్రకారం ఆయన తెలంగాణ పాలిటిక్స్(Telangan Politics)లో ఉంటారా? లేక వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. రాజాసింగ్ రాజీనామా ఆమోదంతో శివసేన(Shiva Sena)లో ఆయన చేరుతారని ప్రచారం జరిగింది. కాగా ఆయన సైతం మహారాష్ట్రకు చెందిన హిందుత్వ పార్టీ నుంచి తనకు ఆఫర్ ఉందని చెప్పారు. అయితే ఏ పార్టీ అనేది చెప్పకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే శివసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి(Shinde) షిండే వర్గమైతే.. మరొకటి ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) వర్గం. ఒకటి ఎన్డీయే భాగస్వామ్యంతో ఉండగా మరొకటి ఇండియా భాగస్వామ్యంతో ఉంది. కాగా షిండే వర్గం ఎన్డీయే భాగస్వామ్యంతో ఉన్న నేపథ్యంలో రాజాసింగ్ ను చేర్చుకోవద్దనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరి ఆయనకు వచ్చిన ఆఫర్ ఏ పార్టీ నుంచి? ఆయన చేరితే ఎందులో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Congress on KTR: మెదక్ ప్రజలను గాడిదలు అన్న కేటిఆర్.. ఎస్పీకి ఫిర్యాదు