Mayasabha: సాధారణ మనుషులు రాజకీయాల్లో చేరి ప్రత్యర్థులుగా మారిన ఎన్నో కథలు చూసి ఉంటాం. కానీ ఇద్దరు స్నేహితులను కూడా రాజకీయాలు ప్రత్యర్థులుగా ఏలా మార్చాయి అన్న కథాంశంతో తెరకెక్కింది ‘మయసభ’ అనే వెబ్ సిరీస్. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష కలిసి ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. కాకర్ల కృష్ణమ నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి, రామిరెడ్డి పాత్రలో చైతన్య రావు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ సోనీ లివ్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. డైరెక్టర్ దేవ కట్ట, హీరో ఆది పినిశెట్టిలును చూస్తుంటే ఈ సిరీస్ ఎన్నో భావోద్యేగాలు నిండి ఉన్నాయని తెలుస్తుంది. దేవ కట్ట తీసిన ప్రతి సినిమా సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడేదిగానే ఉంది. ఈ సిరీస్ మీద కూడా అదే విధంగా ఉంటుందని అభిమానులు ఆసిస్తున్నారు.
Read also-Mahabubabad district: కళ్ళు లేకపోయినా ఐరిష్ టెస్టులా.. మీసేవ కేంద్రాల ఆగడాలు
విడుదలైన టీజర్ ను చూస్తుంటే తెలుగు రాజకీయాలను ప్రతిబింబించేలా ఉన్నాయి. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న వైస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులను పోలి ఉండేలా ఆది పినిశెట్టి, చైతన్య రావు పాత్రలు రూపొందించారు. వైఎస్సార్, సీబీఎన్ జీవితాల్లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలు ఈ టీజర్ లో కనిపించాయి. వారి మధ్య జరిగిన సంభాషణలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. రాజకీయ చదరంగంలో ఇద్దరు స్నేహితులు ఎలా.. ఎత్తులకు పై ఎత్తులు వేసుకున్నారు, అనేది టీజర్‌లో కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు దేవ కట్ట. ఒకప్పటి తెలుగు పొలిటికల్ ఫ్లేవర్ ఉండటంతో ఈ సిరీస్ లో ఎవరు హీరోనో.. ఎవరు విలనో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also- YSRCP: ‘స్వేచ్ఛ’ ఎఫెక్ట్.. వైసీపీని వీడటంపై ధర్మాన ఫుల్ క్లారిటీ.. మనసులో మాట బయటికొచ్చిందే!
ఈ సిరీస్‌లో దేవ కట్టా రాసిని కొన్ని డైలాగులు ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉన్నాయి. ‘ఫ్రెండ్‌గా ఒక మాట చెప్పనా నాయుడు… యుద్ధం నీ ధర్మం’, ‘వ్యవసాయాన్ని మించిన చదువు లేదు పెద్దయ్య… మా అందరికన్నా పెద్ద చదువు నీదే.’ అంటూ రామిరెడ్డి చెప్పిన డైలాగులు, ‘వసూలు చేసే కులం లో పుట్టిన రౌడీవి నీకెందుకయ్యా వైద్యం.’, ‘20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పు కింద నలిగిపోతుంది అనుకోలేదు.’ అన్న నాయుడు చెప్పిన డైలాగులతో ఈ సిరీస్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా తెలుగు రాజకీయాలు మాత్రం ఈ సిరీస్ తర్వాత బాగా హీటెక్కేలా కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.
