Gaddam Prasad Kumar: డ్రగ్స్ సంస్కృతిని ఉక్కు పాదంతో అణిచివేయాలని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Min Jupally Krishna Rao) పిలుపునిచ్చారు. వికారాబాద్ పట్టణ కేంద్రంలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ను శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar), శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ లతో కలిసి మంత్రి జూపల్లి రామకృష్ణారావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిని గుర్తించి కేసుల నమోదుతో కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతుందన్న దానిపై పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా నిఘా పెట్టాలన్నారు. అవసరం అనుకుంటే ఇతర రాష్ట్రాల సహకారం కూడా తీసుకోవాలని మంత్రి సూచించారు.
కల్లును ఎగుమతి చేసే విధంగా
రాష్ట్ర వ్యాప్తంగా నిధులను కేటాయించి చెరువు కట్టల మీద, గుట్టల పైన, కాలువల పక్కన ఈత, తాటి, ఖర్జూర వంటి చెట్లను పెంచేందుకు ప్రోత్సహించాలని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామంలో కానీసం 5 ఎకరాల్లో చెట్లను నాటేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాదు(Hyderabad)కు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం నుంచి నీరా, కల్లును ఎగుమతి చేసే విధంగా గీత కార్మికులు ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. కల్లు సేవించి మరణించిన సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కల్తీ కల్లు మూలంగా కూలి నాలి చేసుకుని పొట్ట నింపుకుంటున్న పేదలు బలి కాకూడదన్నారు. కల్తీ కల్లు విక్రయానికి పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasada Kumar) మాట్లాడుతూ గౌడ్ అన్నల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల్లో ఈత, తాటి వనాలను పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి(Mahender Reddy) మాట్లాడుతూ ప్రజలకు హాని కలిగించే సంఘటనపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
Also Read: Ponnam Prabhakar: అలా చేస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి.. మంత్రి పొన్నం ప్రభాకర్
కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కార్యాలయాలు నిర్వహించకుండా ఉండేదుగాను ఎక్సైజ్ శాఖకు అధునాతన భవనాలను నిర్మించుకోవడం శుభ సూచికమని పేర్కొన్నారు. కల్తీ కల్లు, మాదకద్రవ్యాల నివారణకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ నాశనానికి డ్రగ్స్ ఎంతో కీడును కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెల్లో కూడా డ్రగ్స్ వ్యాపిస్తున్నాయని వాటిని అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన సూచించారు. రిసార్ట్ లపై ప్రత్యేక దృష్టి సారించి డ్రగ్స్ నివారణకు అధికారుల కృషి చేయాలి అన్నారు. అంతకుముందు కార్యాలయ ఆవరణలో మంత్రి, సభాపతి అధికారులతో కలిసి ఈత మొక్కలను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దశరథ్, సూపరింటెండెంట్ విజయ భాస్కర్, అదనపు కలెక్టర్ ఎం సుధీర్, డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్డీవో వాసు చంద్ర, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ శాఖ సర్కిల్, సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Congress party ministers: త్వరలో మాడ్గుల నుంచి దేవరకొండ వరకు డబుల్ రోడ్డు