Congress vs BRS: కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్, బిఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నువ్వు రాసలీలల రాస్మయివి అంటూ కాంగ్రెస్(Congress) నేతలు వాల్ పోస్టర్లు వేయగా నువ్వు కామలీలల కవ్వంపల్లివి అంటూ బిఆర్ఎస్(BRS) నేతలు పోస్టర్లు వేశారు. లక్షలాది మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఆదర్శంగా ఉండాలనే సోయి మరిచి దిగజారుడుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి మానకొండూర్ నియోజక వర్గంలో చోటు చేసుకుంది.
Also Read: Uttam Kumar Reddy: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణకు అన్యాయం!
గుండ్లపల్లి పొత్తూర్ డబుల్ రోడ్డు లేపిన వివాదం
మానకొండూర్ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్(Rasamayi Balakishan) ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Kavampalli Satyanarayana)ల మధ్య పోస్టర్ల వార్ తీవ్రస్థాయికి చేరుకుంది. బిఆర్ఎస్(BRS) కాంగ్రెస్(Congress) పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం నెలకొంది. మానకొండూర్ నియోజకవర్గంలోని గుండ్లపల్లి నుంచి పొత్తూర్ వరకు నిర్మించాల్సిన డబుల్ రోడ్డు(CC Road) విషయంలో రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదలైనప్పటికీ పనులు పూర్తి కాలేదంటూ బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయగా బీఆర్ఎస్(BRS) హయాంలో నిర్లక్ష్యం వహించారని కాంగ్రెస్(Congress) నేతలు ఆరోపిస్తున్నారు. ఒకరిపై మరొకడు “రాసలీలలు”, “కామలీలలు” వంటి పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టర్లు విడుదల చేస్తూ పరస్పరం విమర్శించుకుంటున్నారు.
Also Read: Crime News: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఘాతుకం