Bahubali Epic
ఎంటర్‌టైన్మెంట్

Baahubali The Epic: ‘బాహుబలి’ రీరిలీజ్ గురించి… రాజమౌళి ఏమన్నారంటే?

Baahubali The Epic: తెలుగు చలన చిత్ర చరిత్రలో ‘బాహుబలి’ సినిమా ఎంతటి ఖ్యాతి సాధించిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకూ ఉన్న తెలుగు సినిమా రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసి మోత మోగించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా జులై 10, 2015 విడుదలై సంచలనం సృష్టించింది. కాగా నేటికి ఈ సినిమా విడుదలై పదేళ్లు అయింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ ‘బాహుబలి’ పాత్రలో హీరోగా ఒదిగిపోయారు. రానా ప్రతినాయకుడైన ‘బల్లాలదేవుడు’ పాత్ర పోషించి మెప్పి్ంచారు. అనుష్క, తమన్నాలు కథానాయికలుగా కనువిందు చేశారు. ఇందులో హీరోతో సమానంగా ఉండే రమ్యకృష్ణ ‘శివగామి’గా, సత్యరాజ్ కట్టప్పగా నటించి సినిమాకు ప్రాణం పోశారు. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయిన ఈ సినిమా దాదాపు 600 కోట్లు రూపాయలు వసూళ్లు సాధించి టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వం వహించగా.. రాజేంద్ర ప్రసాద్ రచయితగా వ్యవహరించారు. కీరవాణి బాణీలు సినిమాను మరో స్థాయిలో నిలిపేలా చేశాయి. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Also Read – Janasena: జనసేన ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు!

‘బాహుబలి’ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవడంతో దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై ఆసక్తికర పోస్ట్ ఒకటి పెట్టారు. దానిని చూసి ప్రభాస్(Prabhas) అభిమానులు మరోసారి రికార్డులు బద్దలవడానికి సిద్దంగా ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకూ దర్శకుడు రాజమౌళి ఏం చెప్పారంటే.. బాహుబలి సినిమా ఎన్నో ప్రయాణాలకు నాంది, మరెన్నో మధుర జ్ఞాపకాల నిధి. ఎంతో మందికి స్పూర్తి.. ఈ సినిమా విడుదలై నేటికి పదేళ్లు పూర్తయింది. రెండు భాగాలుగా ఉన్న సినిమాను ఒకే భాగంగా మార్చి అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. ‘బాహుబలి ది ఎపిక్’ (Baahubali TheEpic) అనే పేరుతో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నామని పోస్ట్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. రీరిలీజ్‌లోనూ ఇంకెన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో అని ఎదురు చూస్తున్నారు.

Also Read –Budget friendly Luxury Interior: మీ ఇంటికి రిచ్ లుక్ కావాలా? ఈ టాప్-10 చిట్కాలు ఫాలో అవ్వండి!

ఈ విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘బాహుబలి’ రీరిలీజ్ కోసం ప్రేక్షకులతో పాటు నిర్మాతలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయంపై నిర్మాత శోభు యార్లగడ్డ మూడు రోజులు క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. బాహుబలి రిలీజై పదేళ్లు కావోస్తుంది. రీరిలీజ్ ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది అని అడిగారు. విడుదల సమయంలో ప్రముఖులు ‘బాహుబలి’ సినిమాపై పెట్టిన పోస్టులను షేర్ చేసుకున్నారు. కాగా ఈ రోజు రాజమౌళి పెట్టిన పోస్టుతో అందరికీ ఓ క్టారిటీ వచ్చింది. అక్టోబర్‌ 31న సినిమా రెండు పార్టులు కలిపి ఒకే సినిమాగా రీరిలీజ్ కానుందని తెలియడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే నెలలో ప్రభాస్ పుట్టినరోజు కూడా ఉండటం విశేషం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు