CM Revanth Reddy: తెలంగాణ హక్కులను ఎవరికీ తాకట్టు పెట్టమని సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) స్పష్టం చేశారు. దేవుడు ఎదురొచ్చినా, నిటారుగా నిలబడి పోరాడుతామన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మాజీ సీఎం కేసీఆర్ అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించారు. ప్రజలకు ప్రయోజనం చేకూరడంలో తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. బుధవారం ఆయన ప్రజా భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో మాట్లాడుతూ, కేసీఆర్ సలహాలు, సూచనలను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. ఎక్స్‌పర్ట్ ఓపీనియన్లను కూడా సభలో వినిపిద్దామని చప్పారు.
Also Read: Collector Hari Chandana: విద్య ఒక విలువైన సంపద.. చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలి
అసెంబ్లీకి రండి.. లేదంటే ఫాంహౌస్‌కు వస్తాం..
అసెంబ్లీ పెట్టేందుకు ప్రభుత్వం రెడీగా ఉన్నదని, ప్రతిపక్ష పార్టీ కూడా స్పీకర్‌కు ఓ లెటర్ రాయాలని సీఎం కోరారు. బీఆర్ఎస్, (BRS) కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాల హాయాంలో ఏమేమీ జరగాయనే దానిపై చర్చ చేద్దామన్నారు. సభా నాయకుడిగా తాను మాటిస్తున్నానని, ఎవరి గౌరవానికి భంగం కలుగకుండా చూసుకునే బాధ్యత తనదని అన్నారు. కేసీఆర్ వస్తే, ఎక్స్‌పర్ట్ కమిటీ, స్టేక్ హోల్డర్స్‌ను కూడా ఆహ్వానిస్తానని సీఎం చెప్పారు. అర్ధవంతమైన చర్చ జరిగితే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఒకవేళ కేసీఆర్ ఆరోగ్యం సహకరించకుంటే, తానే ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు మంత్రుల బృందాన్ని పంపిస్తానని, మాక్ అసెంబ్లీ నిర్వహిద్దామని పేర్కొన్నారు. దానికి కేసీఆర్ అంగీకరించకుంటే, ఎర్రవెల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశానికి తాను వెళ్తానని సీఎం ప్రకటించారు. వాస్తవాలను ప్రజలకు అందించడమే తమ ఉద్దేశమని వ్యాఖ్యానించారు.
ఎవరేం చేశారో చర్చ పెడుదాం
నీళ్లు, నిధులకు సంబంధించి కేసీఆర్ కుటుంబం చేసిన తప్పిదాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోయి, ఆ తర్వాత డిపాజిట్లు కోల్పోయి, ఆ తరువాత అభ్యర్థులు కూడా దొరకక ఫ్రస్ట్రేషన్‌లో కొందరు విచిత్రమైన వాదన తీసుకొస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ (Congress) పాలనలో రాష్ట్రం నాశనమైందనే వితండవాదనను తీసుకువస్తున్నారని ఇది కరెక్ట్ కాదన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై చట్ట సభలో చర్చించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని నొక్కి చెప్పారు. కేటీఆర్ (KCR) విమర్శలకు తాను దిగజారి సమాధానం ఇవ్వలేనన్నారు. శాశ్వతంగా కృష్ణా పరివాహక ప్రాంత (Farmers) రైతులకు మరణశాసనం రాసే అధికారం కేసీఆర్‌కు ఎవరూ ఇవ్వలేదన్నారు.
కేసీఆర్‌ను వంద కొరడా దెబ్బలు కొట్టినా తప్పులేదు
తెలంగాణలోకి ప్రవేశించిన వెంటనే కృష్ణా నీటిని ఒడిసి పట్టుకుని ఉంటే, రాయలసీమకు నీరు తరలించుకు వెళ్ళే అవకాశం ఉండేది కాదని సీఎం అన్నారు. నీళ్లను తీసుకెళ్లడం ద్వారా పవర్ ప్రాజెక్ట్ డీ ఫంక్ట్ అవడంతో విద్యుత్ పరంగానూ తెలంగాణకు నష్టం జరిగిందన్నారు. పాలమూరు రంగారెడ్డిలో 2 టీఎంసీలను తరలించాల్సి ఉంటే 1 టీఎంసీకి తగ్గించారని చెప్పారు. పదేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకపోవడంతో రావాల్సిన హక్కులు రాకపోగా, ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.
కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చేసిన అన్యాయం కంటే వెయ్యి రేట్లు కేసీఆర్ (KCR) తెలంగాణకు ద్రోహం చేశారని ఆరోపించారు. ఇందుకు శిక్షించాల్సి వస్తే ఉమ్మడి రాష్ట్ర పాలకులను ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే కేసీఆర్ చేసిన పనికి వంద కొరడా దెబ్బలు కొట్టాల్సిన పరిస్థితి ఉన్నదన్నారు. కాంగ్రెస్ హయాంలో 54 లక్షల ఎకరాలకు నీళ్లిస్తే ఒక ఎకరాకు నీళ్లివ్వడానికి చేసిన ఖర్చు రూ.93 వేలు ఉండగా, కేసీఆర్ సమయంలో 15 లక్షల ఎకరాలకు నీళ్లివ్వగా, ఒక ఎకరాకు సుమారు రూ.11 లక్షల వరకు ఖర్చు చేశారన్నారు. ఏ ప్రభుత్వం హయాంలో తప్పులు జరిగాయనేది ప్రజలు అర్ధం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
Also Read: Alia Bhatt: అలియాకు బిగ్ షాక్.. రూ.77 లక్షలు స్వాహా.. ఇలా కూడా మోసపోతారా?