Sambasiva Rao Slams Modi: కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ (Modi) ప్రైవేట్ పరం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) మండిపడ్డారు. కార్మికుల సమ్మెలో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతాంగ, సర్వీస్ రంగ కార్మిక, బ్యాంక్ ఎంప్లాయిస్, ఎల్‌ఐసీ తదితర యావత్ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తున్నారన్నారు.
Also Read: MEPMA and SERP: ప్రభుత్వం జీవో ఇచ్చినా ముందుకు సాగని ప్రక్రియ!
8 గంటల పని హక్కు
దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను సగానికి పైగా ప్రైవేట్ పరం చేశారని, ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా లోపల ప్రభుత్వ రంగం లేదన్నారు. బ్రిటీష్ కాలంలో సాధించుకున్న 8 గంటల పని హక్కును మార్పు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, వ్యతిరేకించాల్సిన తెలంగాణ ప్రభుత్వం కూడా రోజుకు 10 గంటలు పని చేయాలని సర్క్యులర్ జారీ చేసిందని ఆరోపించారు. పని గంటల్లో గంట విరామమని చెప్పి, క్రమేణ విరామం పక్కన పెట్టి పది గంటలు మాత్రమే పని మిగులుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోదీ (Mod) అడుగు జాడల్లో నడవకూడదని కోరారు.
35 వేల మంది దిగిపోయారు
బ్యాంకింగ్ రంగం ప్రభుత్వం చేతిల్లో ఉండడంతో ఆపద కాలంలో ఉపయోగపడ్డాయన్నారు. ఇప్పుడు బ్యాంకులన్ని విలీనం చేసి దానిలో పనిచేసే సిబ్బందిని 8 లక్షలకు కుదించారని, 25 లక్షల మంది అవుట్‌సోర్సింగ్ పద్దతిలో బ్యాంకింగ్ రంగంలో ఉన్నారని పేర్కొన్నారు. ఎల్‌ఐసీలో 12 లక్షల మంది ఉండే ఉద్యోగులు 8 నుంచి 9 లక్షలకు పరిమితమయ్యారని, సింగరేణిలో లక్ష 16 వేల మంది ఉంటే ఇప్పుడు 35 వేల మంది దిగిపోయారన్నారు. రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ పెద్ద సంస్థలని, ఆర్టీసి కూడా కేంద్రం అడుగు జాడలో ఆర్టీసీ చంపేస్తున్నారన్నారు. రైల్వేను, అత్యంత సున్నితం రక్షణ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని, గ్రామ పంచాయతీ కార్మికులు 5 నెలల నుంచి జీతాలు లేవని, కొన్ని గ్రామ పంచాయతీలు ఎక్కువ జీతాలు ఇస్తుంటే ఇవ్వొద్దని సర్క్యులర్ జారీ చేశారని పేర్కొన్నారు.
Also Read: HYDRAA: ‘బతుకమ్మ’ను బతికించిన హైడ్రా.. ఎలా సాధ్యమైంది?