Etela Rajender: పొద్దంతా కాయ కష్టం ఉపశమనానికి కల్లు తాగే వారంతా పేదవారేనని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) తెలిపారు. కల్లు కల్తీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు. కల్తీ కల్లు తాగి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎంపీ ఈటల రాజేందర్, వడ్డేపల్లి రాజేశ్వరరావు (Vaddepalli Rajeswara Rao) పరామర్శించారు. బాధితులతో మాట్లాడి భరోసా కల్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే కల్తీ కల్లు తాగి ముగ్గురు మరణించారని, మరో ఏడుగురు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, 15 మంది నిమ్స్‌లో ఉన్నారని తెలిపారు.
Also Read:Bomb threat Hyderabad: అణువణువు గాలించిన బాంబు డిటెక్షన్ బృందాలు!
అధికారుల నిర్లక్ష్యం
వీరిలో కొందరి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నదన్నారు. చాలామంది కిడ్నీలు పాడయ్యాయని, బాధితులందరికీ ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా ఇది దాగదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని పట్టుపట్టారు. కల్తీ కల్లు విక్రయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని, ఎక్కువ మొత్తంలో అమ్మకాలు చేపట్టాలని డిపార్ట్‌మెంట్ ఒత్తిడి తెస్తున్నదన్నారు. ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం పాజిటివ్ ఆదాయం కాదని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని ఈటల రాజేందర్ (Etela Rajender) డిమాండ్ చేశారు.
Also Read: Swetcha Effect: రైతులకు పంట నష్టపరిహారం.. స్వేచ్ఛకు ప్రత్యేక కృతజ్ఞతలు