Gangula Kamalakar: రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖలో కుంభ కోణం జరిగిందని, ఈ కుంభ కోణం పై ఎన్ని సార్లు రకరకాల ఏజెన్సీలకు పిర్యాదు చేసినా స్పందన కరువైందని మాజీ మంత్రి గుంగల కమలాకర్(Gungala Kamalakar) అన్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్(BRS) పార్టీ పుట్టింది తెలంగాణ కోసమే అన్నారు. రాష్ట్రాన్ని సాధించడమే కాదు వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మి ఏడు వేల 600 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందని, ఈ టెండర్లలో మొత్తం ప్రక్రియ పూర్తి చేసేందుకు 90 రోజులు గడువు విధించారన్నారు.
గడువు ముగిసినా టెండర్లు
ఇప్పటికే 605 రోజులు పూర్తయినా ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. క్వింటాల్ కు 2007 ధర నిర్ణయించగా రూ.2230లు టెండర్లు దక్కించుకున్న వాళ్ళు మిల్లర్ల నుంచి వసూల్ చేశారన్నారు. వెయ్యి కోట్ల రూపాయల మేర కాంట్రాక్టర్లు ప్రభుత్వ పెద్దలకు ముడుపుల రూపంలో అందించారని, ఇప్పటివరకు సగం ధాన్యమే అమ్మారన్నారు. గడువు ముగిసినా టెండర్లు ఇప్పటి వరకు రద్దు చేయలేదన్నారు. బిడ్డర్లు కట్టిన డబ్బును తిరిగి చెల్లించే ప్రయత్నం జరుగుతోందని, ఈ అక్రమాల పై అసెంబ్లీ వేదిగ్గా కూడా ప్రశ్నించామన్నారు. హై కోర్టు లో పిటిషన్ వేస్తే 15 సార్లు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించినా ప్రభుత్వం దాఖలు చేయలేదన్నారు. ప్రభుత్వానికి జమ చేయాల్సిన సొమ్ము జమ చేయనందుకు బిడ్డర్ల పై చర్యలు తీసుకోవాల్సింది పోయి వారిని కాపాడుతున్నారన్నారు.
Also Read: Nidhhi Agerwal: నిధి మంచి మనసుకు… అభిమానులు ఫిదా!
ఎందుకు స్పందించడం లేదు
అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయని, ఈ అంశం పై వచ్చే సోమవారం హైదరాబాద్(Hyderabad) లోని ఈడీ కార్యాలయానికి పిర్యాదు చేస్తామన్నారు. ఎన్ని విచారణ సంస్థలు ఉన్నాయో అన్నిటికి పిర్యాదు చేస్తామన్నారు. ఈ అంశం పై బండి సంజయ్(Bandi Sanjay) ,కిషన్ రెడ్డి(Kishan Reddy) ఎందుకు స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లు సివిల్ సప్లై కుంభ కోణంలో కుమ్మక్కయ్యాయన్నారు. ఇది భారత దేశంలోనే అతి పెద్ద కుంభ కోణం అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలుగా మారుస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి ,నోముల భగత్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read: Venu Swamy: నా దగ్గరికి వారు కూడా వస్తారు.. సంచలన విషయాలు బయట పెట్టిన వేణు స్వామి!