War 2: ‘వార్ 2’ సినిమా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న మల్టీ స్టార్ మూవీ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. బాలీవుడ్‌లో రిలీజై మంచి హిట్ అందుకున్న ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందించారు. ‘బ్రహ్మాస్త్ర’ వంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించిన దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో విజువల్స్ హాలీవుడ్‌ను తలపిస్తున్నాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయని టీమ్ కూడా చెబుతోంది. ఆగస్టు 14 న ‘వార్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read- Youtuber Ali Aalyan Iqbal: లద్దాఖ్‌లో అతి చేసిన యూట్యూబర్.. రంగంలోకి పోలీసులు.. ఇక మూడినట్లే!
‘వార్ 2’ సినిమా పూర్తయిందని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌లు ప్రకటించారు. తాజాగా హీరోయిన్ కియారా అడ్వాణీ కూడా ఈ సినిమాపై పోస్ట్ పెట్టారు. ప్రపంచం ఈ సినిమాను ఎప్పుడు చూస్తుందా అని ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. హృతిక్ పెట్టిన పోస్ట్‌ను హీరోయిన్ కియారా షేర్ చేశారు. ‘వార్ 2’ సినిమా విషయంలో ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో తానూ అలాగే ఉన్నానన్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవమన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి దర్శకుడు అయాన్ ముఖర్జీ సృష్టించిన అద్భుతాన్ని ప్రపంచం ఎప్పుడు చూస్తుందా అని కుతూహలంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. టీమ్ మొత్తం ప్రాణం పెట్టి చేశారని, ఈ సినిమా వెనక ప్రతి ఒక్కరి శ్రమ ఉందని రాసుకొచ్చారు.
Also Read- Soothravakyam: వివాదాస్పద నటుడు షైన్ టామ్ చాకో పోలీస్‌గా నటించిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇప్పటికే ‘వార్ 2’ చిత్రం పూర్తయిందంటూ ఎన్టీఆర్ అప్‌డేట్ ఇచ్చారు. సహ నటుడు హృతిక్ రోషన్ గురించి తన అనుభవాలు చెప్పుకొచ్చారు. హృతిక్ సెట్‌లో ఉన్నంతసేపూ చాలా సందడిగా ఉండేదన్నారు. ఆయన ఎనర్జీకి ఫిదా అయ్యానని, తాను కూడా అదే ఎనర్జీని పొందడానికి ప్రయత్నిస్తానన్నారు. ఈ జర్నీలో హృతిక్ రోషన్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో విజువల్స్ హాలీవుడ్‌ను తలపిస్తున్నాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయని టీమ్ కూడా చెబుతోంది. ఇదిలా ఉండగా.. ‘వార్ 2’ సినిమాకు సంబంధించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 7,500 స్క్రీన్‌లలో ‘వార్ 2’ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.