Anushka Shetty( image source ;x)
ఎంటర్‌టైన్మెంట్

Anushka Shetty: అలా చెప్పగానే… ఓకే అనేశానంటున్న అనుష్క

Anushka Shetty: తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటి అనుష్క శెట్టి. ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైనా ఆ సినిమాతో మంచి హిట్ అందుకోలేక పోయారు. ఆ తర్వాత విడుదలైన ‘విక్రమార్కుడు’ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో స్వీటీ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయారు. 2009లో నటించిన అరుంధతి ఆమె కెరీర్‌ లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. డ్యూయల్ రోల్ లో నటించి ఆమె నటనా నైపుణ్యం చూపించింది. ఈ సినిమాకు నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా ఆమె ఖాతాలోకి వచ్చి చేరాయి. ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ అయిన ‘బాహుబలి’, ‘బాహుబలి 2’లలో దేవసేనగా నటించి హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. కమర్షియల్ చిత్రాలే కాకుండా ‘సైజ్ జీరో’ వంటి విభిన్న కథాంశం ఉన్న చిత్రాల్లో కూడా నటించి నటనపై తనకు ఉన్న మక్కువను నిరూపించుకున్నారు.

Read Also –Bengaluru Crime: భార్యను నేలపైకి తోసి.. పీకపై కాలుతో తొక్కి.. హత్య చేసిన భర్త!

ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన జేజమ్మ ఇప్పుడు సినిమాలు తీయడమే తగ్గించేశారు. 2020 నుంచి గ్యాప్ తీసుకుంటూ సినిమాలు తీస్తున్నారు. 2020లో వచ్చిన ‘నిశ్శబ్దం’ తర్వాత మళ్లీ 2023 లో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో మాత్రమే కనిపించారు. ఇలా కెరీర్‌లో గ్యాప్‌లు తీసుకుంటూ ఉంటే తనను అభిమానించే వారు మాత్రం స్వీటీ సినిమా ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. అనుష్క తీసే సినిమాలకు ప్రత్యేక ఫేన్ బేస్ ఉంటుంది. ఇలా రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే ఎలా? అని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read Also –WhatsApp – AI: వాట్సప్‌లో గమ్మత్తైన ఏఐ ఫీచర్స్.. ఇలా ట్రై చేయండి.. థ్రిల్ అవుతారు!

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో స్వీటీ అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో జేజమ్మ చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను ప్రేక్షకులతో పంచుకున్నారు. స్వీటీ ఆరో తరగతిలో ఉండగా ఓ అబ్బాయి చేసిన లవ్ ప్రపోజల్ గురించి మీడియా ముందు ముచ్చటించారు. ‘ఓ అబ్బాయి నా దగ్గరకు వచ్చి.. నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పాడని స్వీటీ తన ఫస్ట్ ప్రపోజల్ గురించి చెప్పుకొచ్చారు. అప్పుడు తనకు ఐ లవ్ యూ అంటే అర్థం కూడా సరిగా తెలియదని… ఏం చెప్పాలో తెలియక ఓకే అనేశానన్నారు. దీనిని చూసిన నెటిజన్లు స్వీటీ లవ్‌పై స్వీట్ కామెంట్లు పెడుతున్నారు. ఆ సమయంలో అనుష్క అమాయకత్వాన్ని చూసి జాలి పడుతున్నారు. అనుష్క నటించిన ‘ఘాటి’ సినిమా ఈ నెలలో విడుదల కావాల్సి ఉండగా మరో సారి వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు విడుదల తేదీలు ప్రకటించారు. తాజాగా మరోసారి సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ అయింది. వీఎఫ్ఎక్స్ కారణంగా సినిమా లేట్ అవుతుందని మూవీ టీం తెలిపింది. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు