Soothravakyam
ఎంటర్‌టైన్మెంట్

Soothravakyam: వివాదాస్పద నటుడు షైన్ టామ్ చాకో పోలీస్‌గా నటించిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?

Soothravakyam: మలయాళ సినిమాలకు మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మలయాళ సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు. మలయాళ సినిమాలు తెరకెక్కే విధానానికి ఎనలేని గౌరవం, ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో హార్ట్ టచ్చింగ్ మూవీ ‘సూత్రవాక్యం’ (Soothravakyam). ఈ సినిమా మలయాళ వెర్షన్ జూలై 11న ప్రపంచవ్యాప్తంగా జినీవెర్స్ మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇదే సంస్థ ఈ ‘సూత్రవాక్యం’ సినిమాను అదే టైటిల్‌తో తెలుగులోనూ విడుదల చేయనుంది. కాకపోతే తెలుగు ఈ చిత్రం ఈ నెలాఖరుకు విడుదలకానుందని తెలుస్తోంది.

Also Read- Oh Bhama Ayyo Rama: సుహాస్‌ని విజయ్ సేతుపతితో పోల్చిన రాక్ స్టార్.. విషయమేంటంటే?

యూజియాన్ జాస్ చిరమ్మల్ అనే టాలెంటెడ్ దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై కాండ్రేగుల లావణ్యాదేవి సమర్పణలో, కాండ్రేగుల శ్రీకాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో షైన్ టామ్ చాకో (Shine Tom Chacko), విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్ ముఖ్య తారాగణం. నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం. భారతీయ సినిమాను సరికొత్త పుంతలు తొక్కించే ఈ వినూత్న కథా చిత్రానికి రెజిన్ ఎస్.బాబు స్క్రీన్ ప్లే సమకూర్చగా, శ్రీరామ్ చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ, జీన్ పి.జాన్సన్ సంగీతం, నితిన్ కె.టి.ఆర్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు.

Also Read- Udaipur Files Controversy: ‘ఉదయ్‌పూర్ ఫైల్స్’ కాంట్రవర్సీ.. సుప్రీంకోర్టు షాకింగ్ డెసిషన్

ఈ సినిమా విడుదల సందర్భంగా ‘సినిమా బండి’ ఫేమ్ కాండ్రేగుల లావణ్యాదేవి, కాండ్రేగుల శ్రీకాంత్ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్స్‌కు నేరాలు చేసినవాళ్ళు, సదరు నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్ళాలి? ఖాళీ సమయాల్లో పోలీసు సిబ్బంది, పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు? పోలీసులను చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగాలనే ఒక గొప్ప విప్లవాత్మకమైన ఆలోచనకు, వినోదం జోడించి రూపొందిన చిత్రమే ‘సూత్రవాక్యం’ అని తెలిపారు. ఈ సినిమా భారతీయ చలన చిత్ర చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని, ఇంత గొప్ప కంటెంట్, మెసేజ్ కలిగిన ఈ సినిమాను నిర్మించే అవకాశం రావడం పట్ల చాలా గర్వంగా ఉందని అన్నారు. తప్పకుండా ఈ మెసేజ్ ప్రతి పోలీస్ స్టేషన్‌కు చేరాలని, ఆ బాధ్యత ప్రేక్షకులదేనని, మా ప్రయత్నం మేం చేశామని చెప్పుకొచ్చారు. మంచి కాన్సెప్ట్‌తో పాటు వినోదభరితంగా ఈ సినిమా ఉంటుందని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని వెల్లడించారు.

ఇదిలా ఉంటే, కోవిడ్ సమయంలో కేరళలో విదుర పోలీస్ స్టేషన్‌లో.. యువతలో ధైర్యాన్ని నింపి, వారి కలలు, ఆశయాలు పునరుత్తేజం అయ్యేందుకు చేపట్టిన కౌన్సిలింగ్ కార్యక్రమాల స్పూర్తితో ఈ సినిమాను రూపొందించడం గమనార్హం. భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 14 దేశాల్లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ చెప్పుకొచ్చారు. తెలుగులో మాత్రం ఈ మంత్ ఎండింగ్‌కు విడుదల ఉంటుందని తెలిపారు. ఇక ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన షైన్ టామ్ చాకో ప్రస్తుతం ఎలాంటి వివాదంలో చిక్కుకున్నాడో తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు