Udaipur Files
ఎంటర్‌టైన్మెంట్

Udaipur Files Controversy: ‘ఉదయ్‌పూర్ ఫైల్స్’ కాంట్రవర్సీ.. సుప్రీంకోర్టు షాకింగ్ డెసిషన్

Udaipur Files Controversy: విజయ్ రాజ్‌ (Vijay Raz) ప్రధాన పాత్రలో నటించిన ‘ఉదయ్‌పూర్ ఫైల్స్’ (Udaipur Files Controversy) సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కాంట్రవర్సీలో చిక్కుకున్న విషయం తెలిసిందే. భారత్ ఎస్. శ్రీనాథ్ (Bharat S Shrinate) దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 11న విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా విడుదల వేళ ఇస్లామిక్ మత గురువుల సంస్థ జమియత్ ఉలామా-ఇ-హింద్, సినిమా విడుదలను నిషేధించాలంటూ మూడు హైకోర్టులలో పిటిషన్ దాఖలు చేయడంతో.. ఈ సినిమా విడుదల విషయంలో గందరగోళం నెలకొంది. కన్హయ్య లాల్ అనే టైలర్ పట్టపగలు దారుణంగా హత్యకు గురైన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమాను నిలిపివేయాలంటూ, అత్యవసరంగా సినిమాపై విచారణ జరపాలంటూ వచ్చిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించడంతో.. చిత్రయూనిట్ ఊపిరి పీల్చుకుంది.

Also Read- Viral News: 30 రోజుల్లో రూ.20 లక్షలు అప్పుతీర్చిన మహిళ.. ఆలస్యమెందుకు మీరూ కానిచ్చేయండి!

కన్హయ్య లాల్ దారుణ హత్య కేసులో నిందితులలో ఒకరైన మహమ్మద్ జావేద్.. వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు జూలై 14న తిరిగి తెరుచుకున్నప్పుడు తగిన బెంచ్ ముందు తన పిటిషన్‌ను సమర్పించవచ్చని న్యాయమూర్తులు సుధాంశు ధులియా, జాయ్‌మాల్య బాగ్చిలతో కూడిన వెకేషన్ బెంచ్ బుధవారం పేర్కొంది. బార్ అండ్ బెంచ్ ప్రకారం, జావేద్ తరపు న్యాయవాది, ‘ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ట్రైలర్ జూలై 4నే విడుదలైంది. వారు కేవలం ప్రాసిక్యూషన్ వైపునే చూపిస్తున్నారు’’ అని వాదించారు. జావేద్ తరపు న్యాయవాది వాదనను సుప్రీంకోర్టు బెంచ్ తోసిపుచ్చింది. ‘కోర్టు తిరిగి తెరుచుకున్నప్పుడు సంబంధిత కోర్టు ముందు మీ వాదనను తెలియజేయండి. ఆ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దు, విడుదల కానివ్వండి’ అని బెంచ్ పేర్కొంటూ, అత్యవసర విచారణకు నిరాకరించింది. ‘ఉదయ్‌పూర్ ఫైల్స్’ ట్రైలర్ జూలై 4న విడుదలైంది. ట్రైలర్ విడుదల తర్వాత, సినిమా విడుదలను ఆపాలని కోరుతూ జావేద్ పిటిషన్ దాఖలు చేశారు. తన న్యాయవాది, ఈ చిత్రాన్ని ఏకపక్షంగా చిత్రీకరించారని, ఇది జావేద్‌ హక్కును ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.

Also Read- Robbery in ATM: స్పెషల్ డ్రైవ్ చేసిన చోటే ఏటీఎం చోరీ.. దొంగలు ఎలా తప్పించుకున్నారంటే!

‘ఉదయ్‌పూర్ ఫైల్స్’ విడుదలను నిషేధించాలని జమియత్ ఎందుకు డిమాండ్ చేస్తోందంటే..
‘ఉదయ్‌పూర్ ఫైల్స్’ విడుదల ఆపాలని తొలి పిటిషన్‌ను న్యాయవాదులు పియోలీ, ఎజాజ్ ఖురేషి దాఖలు చేశారు. జమియత్ ఉలేమా-ఇ-హింద్ దాఖలు చేసిన మరో పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉంది. జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని, ‘ఉదయ్‌పూర్ ఫైల్స్’ విడుదలను ఆపాలని ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ హైకోర్టులను ఆశ్రయించారు. ఈ చిత్రం 2022 జూన్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కన్హయ్య లాల్ అనే టైలర్ హత్య ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా‌పై గతంలో ఆయన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. అందులో.. ఈ చిత్రం మతపరమైన అశాంతిని రేకెత్తించవచ్చని ఆయన హెచ్చరించారు. చిత్ర ట్రైలర్‌లో ఇస్లాం ప్రవక్త, అతని పవిత్ర భార్యల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయి, ఇది మతపరమైన అశాంతికి కారణం అవుతుంది. అలాగే డియోబంద్‌ను తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరిస్తూ రెచ్చగొట్టే భాషను ఇందులో వాడారు. ప్రస్తుతం వారణాసి జిల్లా కోర్టు, సుప్రీంకోర్టులో పరిశీలనలో ఉన్న జ్ఞానవాపి మసీదు కేసు వంటి సున్నితమైన విషయాలను ఈ చిత్రం ప్రస్తావించిందని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, విశ్వహిందూ పరిషత్ సినిమా విడుదలకు మద్దతు ఇచ్చింది, జమియత్ దీనిని వ్యతిరేకించడాన్ని ‘కపటత్వం’ అని పేర్కొంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాపై చర్చ పెరుగుతుండగా, ‘ఉదయ్‌పూర్ ఫైల్స్’ విడుదలకు అనుమతించిన సుప్రీంకోర్టు నిర్ణయం చిత్ర నిర్మాతలకు పెద్ద ఊరటనిచ్చింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు