Bathukamma Kunta
తెలంగాణ

HYDRAA: ‘బతుకమ్మ’ను బతికించిన హైడ్రా.. ఎలా సాధ్యమైంది?

HYDRAA: అవును.. బతుకమ్మ కుంటను హైడ్రా బతికించింది. ఇప్పుడు కొత్తరూపు సంతరించుకున్న బతుకమ్మ కుంట ఎంతో చూడముచ్చటగా ఉంది. ఇన్నాళ్లు పేరు మాత్రమే వినిపించిన బతుకమ్మ కుంటకు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్)తో మళ్లీ జీవం పోసి మనముందు నిలిపింది కాంగ్రెస్ సర్కార్. ఇక్కడ చెరువెక్కడుంది? అన్నవాళ్లకు ఇదిగో ఇదే చెరువు అనేలా చేసి చూపించింది. ఇంకా చెప్పాలంటే.. ఆనవాళ్లు కోల్పోతున్న బతుకమ్మను బతికించి చూపింది. బతుకమ్మ కుంట మొత్తం 14.02 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే ఆ కుంటనే మాయం చేసి అక్కడ కబ్జా చేసిన నిర్మాణాలను తొలగించి అక్కడ కుంటను పునరుద్ధరించింది హైడ్రా. ఒకప్పుడు కబ్జా కోరల్లో ఎలా ఉండేది..? హైడ్రా దెబ్బకు ఎలా తయారయ్యింది..? అనేది ఈ రెండు ఫొటోలను గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది. జూలై 7న హైడ్రా తీసిన బతుకమ్మ కుంట ఏరియల్ వ్యూ అదిరిపోయింది. సరస్సు యొక్క పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం, నీటి నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పునరుద్ధరణ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి సరస్సు పునరుద్ధరణ పనులు పూర్తవుతాయని హైడ్రా వెల్లడించింది. ఇంతవరకూ ఓకేగానీ ఇదంతా ఎలా సాధ్యమైంది..? ఈ చెరువు విషయంలో కోర్టులు, కేసులు దాకా ఎందుకెళ్లాయి..? అసలు అక్కడ చెరువే లేదన్న మాటల నుంచి చెరువు ఇదిగో అని చూపించే పరిస్థితి ఎలా వచ్చింది? అనే విషయాలు చూద్దాం వచ్చేయండి.

Read Also- Alia Bhatt: అలియాకు బిగ్ షాక్.. రూ.77 లక్షలు స్వాహా.. ఇలా కూడా మోసపోతారా?

బతుకమ్మ చరిత్ర ఇదీ..
హైదరాబాద్‌లోని అంబర్‌పేట, శివం రోడ్‌ల మధ్య బతుకమ్మ కుంట ఉన్నది. ఇది గ్రేటర్ హైదరాబాద్‌లోని పురాతన సరస్సుల్లో ఒకటి. 1962-63 లెక్కల ప్రకారం ఈ కుంట 14 ఎకరాల 6 గుంటల (బఫర్ జోన్‌తో కలిపి 16 ఎకరాల 13 గుంటలు) విస్తీర్ణంలో ఉండేది. కాలక్రమేణా, ఈ కుంట భారీగా ఆక్రమణలకు గురైంది. తాజా సర్వే ప్రకారం కేవలం 5 ఎకరాల నుంచి 6 ఎకరాల 15 గుంటల భూమి మాత్రమే మిగిలి ఉంది. ఒకప్పుడు పూర్తిగా కబ్జాకు గురై, చెత్తాచెదారంతో నిండిపోయి, తన ఆనవాళ్లను కోల్పోయింది. అయితే, ఇటీవల చేపట్టిన పునరుద్ధరణ పనుల తర్వాత ఈ కుంట తిరిగి జలకళను సంతరించుకుంది. మాజీ ఎంపీ వి. హనుమంతరావు వంటి స్థానికులు ఈ కుంటను పునరుద్ధరించాలని హైడ్రాను సంప్రదించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా ఈ కుంటను సందర్శించి, పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఈ స్థలం తమదేనంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించినా, న్యాయ పోరాటం తర్వాత హైకోర్టు బతుకమ్మ కుంటను చెరువుగానే గుర్తించాలని తీర్పు ఇచ్చింది. హైడ్రాకు అనుకూలంగా తీర్పు రావడంతో అభివృద్ధి పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. సుమారు రూ.7 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. పనులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. ముందుగా ఆక్రమణలను తొలగించడం, పూడిక తీయడం, సహజ పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం మొదలుపెట్టారు. పూడిక తీసే పనుల ప్రారంభంలో కేవలం నాలుగు అడుగుల లోతులో (మోకాలు లోతు) బిర‌బిరా గంగ‌మ్మ అంటూ నీరు ఉబికి రావడం విశేషం. కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం పార్క్, ఓపెన్ జిమ్, బతుకమ్మ ఆడుకోవడానికి ప్రత్యేక వేదిక, పచ్చదనం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. రాళ్లతో ఆకర్షణీయమైన గట్టును కూడా నిర్మించారు.

రేవంత్ చేతుల మీదుగా..
కాగా, కేవలం నాలుగు నుంచి ఆరు నెలల్లోనే ఈ కుంట జలకళను సంతరించుకుని ఒక సుందరమైన కొలనుగా మారింది. సుమారు 70% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఏడాది బతుకమ్మ పండుగ నాటికి పనులను పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకొస్తామని హైడ్రా అధికారులు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంటను ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన బతుకమ్మ సంబురాలను ఇక్కడే అధికారికంగా నిర్వహించనున్నారు. కబ్జాకు గురై కనుమరుగైన ఒక జల వనరును తిరిగి బతికించడంపై స్థానికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా పనితీరును, హైడ్రాను తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనాలు అభినందిస్తున్నారు. ఈ పునరుద్ధరణ ప్రాజెక్టు హైదరాబాద్ నగరంలో జల వనరుల పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి జరుగుతున్న కృషికి చక్కటి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఒక‌ప్పటి ఎర్రకుంట‌నే కాల‌క్రమంలో బ‌తుక‌మ్మ కుంట‌గా మారింద‌ని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి. కాల‌క్రమంలో బ‌తుక‌మ్మ కుంట‌లో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పోయ‌డంతో చెరువు ఆన‌వాళ్లు కోల్పోయింద‌ని స్థానికులు చెప్పారు. బ‌తుక‌మ్మ కుంట చుట్టూ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేపట్టడంతో.. కుంట‌లో నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతుండటంతో ప‌రిస‌ర ప్రాంత‌ల్లో ప‌ర్యావ‌ర‌ణం, భూగ‌ర్భ జ‌లాల పెరుగుద‌ల‌తో పాటు ఆహ్లాద‌క‌రమైన వాతావ‌ర‌ణం ఏర్పడింది. ఒకప్పుడు పరిస్థితి అటుంచితే ఇప్పుడు మాత్రం బతుకమ్మ కుంట అనేది తెలంగాణ సంస్కృతిలో ఒక పవిత్రమైన ప్రదేశంగా మారిపోయింది. ఎనీ.. వే హ్యాట్సాప్ టూ హైడ్రా.

Read Also- YS Jagan: చిత్తూరు పర్యటనలో లాఠీఛార్జ్.. వైఎస్ జగన్‌ను టచ్ చేసిన ఎస్పీ!

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?