Oh Bhama Ayyo Rama: కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు హీరోగా మారిన సుహాస్ (Suhas).. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళం చిత్రం ‘జో’తో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (Malavika Manoj) ఈ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. రామ్ గోధల దర్శకత్వంలో వీ ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. జూలై 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్ బిగ్ టికెట్‌ను ఆవిష్కరించి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పారు.
Also Read- Samantha: సమంత, రాజ్ ని అక్కడే పెళ్లి చేసుకుంటుందా.. ఈ పోస్ట్ తో కన్ఫర్మ్?
ఈ సందర్బంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. సుహాస్ నాకు సోదరుడి లాంటి వాడు. తనని ఎప్పుడూ కలిసినా చిరునవ్వుతో పాజిటివ్‌గా కనిపిస్తూ, ప్రేమగా మాట్లాడతాడు. ఎటువంటి నేపథ్యం లేకుండా హీరోగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మాలాంటి నేపో కిడ్స్ అయినా సినిమా పరిశ్రమలో కష్టపడాల్సిందే. ఇక్కడ కష్టపడితేనే ఎవరికైనా విజయం. నేను ఈ విషయాన్ని ఓ నెపో కిడ్‌గా చెబుతున్నా. ఇక్కడ నెపోటిజం వర్క్ చేయదు. అది ఒక స్టేజ్ వరకు మాత్రమే. ఆ తర్వాత మన కష్టం మీదే అంతా ఆధారపడి ఉంటుంది. మన ఫ్యూర్ సోల్‌తో సినిమాకు పనిచేస్తే.. అన్ని అవే కలిసి వస్తాయి. అలాగే విజయం కూడా. యూట్యూబ్ నుంచి హీరోగా ఎదిగిన సుహాస్ జర్నీ ఎందరికో ఇన్‌స్పిరేషన్. తమిళంలో విజయ్‌సేతుపతిలా తెలుగులో సుహాస్ కూడా అలాంటి స్టారే అని నేను భావిస్తాను. అన్ని తరహాల సినిమాలను చేస్తున్నాడు. ఇండస్ట్రీలో సక్సెస్ కావడం కష్టమే. కానీ కష్టపడితే సక్సెస్ కచ్చితంగా వస్తుంది. ఈ సినిమా విజయం సాధించి నిర్మాతలకు, దర్శకుడికి మంచి బ్రేక్ నివ్వాలి. మంచి టీమ్‌తో రూపొందిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
Also Read- Lavanya Tripathi: 6 నెలలకే లావణ్య త్రిపాఠికి బాబు పుట్టాడా?.. వైరల్ అవుతున్న ఫోటో?
హీరో సుహాస్ మాట్లాడుతూ.. పిలవగానే వచ్చి, మా టీమ్‌ని బ్లెస్ చేసిన మనోజ్ అన్నకు థ్యాంక్స్. ఈ సినిమా కోసం టీమ్ అంతా ఎంతగానో కష్టపడ్డారు. అందరూ ఈ సినిమా చూసిన తర్వాత మాళవిక ప్రేమలో పడిపోతారు. అలీ, అనిత, పృథ్వీ వంటి సీనియర్ ఆర్టిస్ట్‌లతో నటించడం ఎంతో హ్యపీగా ఉంది. ప్రతి అబ్బాయి సక్సెస్‌ఫుల్ లైఫ్‌లో తల్లి, భార్యలు ఇద్దరూ ఎంతో కీలకంగా ఉంటారనే విషయం తెలియంది కాదు. ఈ పాత్రలకు సంబంధించిన ఎమోషన్స్ ఈ చిత్రంలో అందరి హృదయాలను టచ్ చేస్తాయి. అందరి సపోర్ట్‌తో మంచి సినిమాలు చేస్తున్నాన. త్వరలోనే నా కెరీర్‌కు సంబంధించిన మరిన్ని బిగ్‌న్యూస్ తెలియజేస్తానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత హరీష్ నల్లా, దర్శకుడు రామ్ గోధల, కమెడియన్ అలీ వంటి వారంతా మాట్లాడారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
