modi nomination
Politics

Narendra Modi: అట్టహాసంగా నామినేషన్.. వారణాసిలో ప్రధాని మోదీ బల ప్రదర్శన

– వారణాసి నుంచి మరోసారి నామినేషన్
– హాజరైన బీజేపీ సీఎంలు, ఎన్డీఏ భాగస్వామ్య నేతలు
– గంగా నదికి పూజలు
– కాల భైరవుడికి ప్రత్యేక ప్రార్థనలు

Varanasi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న ఈయన, ఈసారి కూడా అదే స్థానం నుంచి నామినేషన్ వేశారు. మంగళవారం జరిగిన ఈ నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య నాయకులు హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తన బలప్రదర్శనను చూపించినట్టయింది.

సోమవారం సాయంత్రం వారణాసిలో ఆరు కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించిన మోదీ.. మంగళవారం ఉదయం గంగా నదీ తీరంలోని దశాశ్వమేధ ఘాట్‌కు వెళ్లారు. యోగి ఆదిత్యానాథ్‌తో కలిసి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత క్రూజ్‌లో నమో ఘాట్‌కు వెళ్లారు. అనంతరం, కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. కాలభైరవుడికి పూజలు చేశారు. అనంతరం, నేరుగా వారణాసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ నామినేషన్ దాఖలు చేశారు.

Also Read: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై కోర్టు తీర్పు

మోదీ వెంట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, మేఘాలయ సీఎం కొన్రాడ్ సంగ్మా సహా పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎన్డీఏ భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి, లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్, అప్నా దళ్ (సోనెలాల్) చీఫ్ అనుప్రియ పటేల్, సుహెల్దెవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్ సహా పలువురు ముఖ్య నేతలు ఉన్నారు.

మోదీ నామినేషన్ వేశాక రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలను పలకరించారు. అలాగే, కాలభైరవ ఆలయాన్ని సందర్శించడానికి ముందు పీఎం మోదీ మాట్లాడుతూ, కాశీతో తన సంబంధం అద్భుతమైనదని, విడదీయరానిదని, పోల్చలేనిదని చెప్పారు. కాశీతో తన అనుంబంధాన్ని మాటల్లో వర్ణించలేనని పేర్కొన్నారు. తాను భావోద్వేగంతో నిండిపోయానని, వారణాసి ప్రేమలో పదేళ్లు ఎప్పుడు గడిచిపోయాయో అని అన్నారు. తనను గంగా నది చేరదీసుకుందని చెప్పారు.

Just In

01

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?