Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం సంచలన నిర్ణయం
Kiran Abbavaram
ఎంటర్‌టైన్‌మెంట్

Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం సంచలన నిర్ణయం

Kiran Abbavaram: మల్టీ టాలెంటెడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘క’ (Ka Movie) సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఊహించని విధంగా సక్సెస్ సాధించి, హీరోగా కిరణ్ అబ్బవరం స్థాయిని పెంచింది. మాములుగా షార్ట్ ఫిలింస్ స్థాయి నుంచి హీరోగా తనకొక స్థాయి సంపాదించుకునే వరకు కిరణ్ అబ్బవరం పడిన శ్రమకు నిదర్శనంగా ‘క’ హిట్ నిలిచింది. ఈ క్రమంలో ఫిలింమేకింగ్‌లో ఆయన ఎన్నో ఇబ్బందులు, కష్టాలు చవి చూశారు. ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా.. తన టాలెంట్‌తోనే ఈ రోజు హీరోగా దూసుకెళుతున్నారు. స్ట్రాంగ్ కంటెంట్, ఇన్నోవేటివ్ మేకింగ్‌తో మూవీస్ చేస్తూ ప్రేక్షకులలో గుర్తింపును పొందుతున్నారు. ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ కష్టాలు తెలిసిన హీరో కాబట్టే.. తనలా ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలుస్తానని ‘దిల్ రూబా’ సినిమా ఈవెంట్‌లో మాటిచ్చారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడా మాటను నిలబెట్టుకునేందుకు సమాయత్తమయ్యారు. అవును.. చెప్పినట్లే తన మాట మీద నిలబడుతూ కొత్త వాళ్లతో తన సొంత బ్యానర్ పై మూవీ ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Siva Shakthi Datta: 16 ఏళ్లు ఇండస్ట్రీ వదిలేసి.. శివ శక్తి దత్తా గురించి ఈ విషయం తెలుసా?

తన గత సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయి తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. కిరణ్ అబ్బవరం నిర్మాతగా ఓ సినిమా చేస్తున్నారు. తన మూవీస్‌కు ఆన్‌లైన్ ఎడిటింగ్ చేసిన టెక్నీషియన్‌ మునికి దర్శకుడిగా ఈ సినిమాతో అవకాశం కల్పిస్తున్నారు. నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ఎమోషనల్ డ్రామాగా.. మంచి కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కనుందని టీమ్ చెబుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేస్తామని అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. తను నడిచొచ్చిన దారిని మరిచిపోని కిరణ్ అబ్బవరం.. కెరీర్ ప్రారంభంలో తనతో పనిచేసిన ఎంతోమంది టెక్నీషియన్స్‌నే తమ కొత్త మూవీస్‌కు కొనసాగిస్తానని చెబుతున్నారు. ఇప్పుడు కొత్త వారితో సినిమాలు చేయాలనే గొప్ప లక్ష్యంతో కిరణ్ అబ్బవరం ముందడుగు వేయడం అభినందించదగిన విషయంగా అంతా చెప్పుకుంటున్నారు.

Also Read- Fish Venkat: ప్రభాస్ చేయలేదు.. ఆ యంగ్ హీరో సాయం చేశాడు

ఈ మూవీ గురించి కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి ప్రయాణం ఒక కలతో మొదలవుతుంది. ఆ కల నిజమవుతుందో, లేదో ప్రయాణం మొదలైనప్పుడు తెలియదు. ఏడేళ్ల కింద ఒక పట్టుదల, డ్రీమ్‌తో సినిమా ఇండస్ట్రీలో నా జర్నీ మొదలైంది. ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ఆదరణతో గుర్తింపు వచ్చింది. నాలాగే ఒక కలతో సినిమా‌ పరిశ్రమకు వచ్చే యంగ్ టాలెంట్‌కు మా కేఏ ప్రొడక్షన్స్ ద్వారా అవకాశాలు అందించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ నెల 10న ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నాం. నా ఈ జర్నీలో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..