Bhairavam OTT: బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohith) హీరోలుగా విజయ్ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘భైరవం’. మే 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్ చిత్రంగా నిలిచింది. ఇందులో అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించారు. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ త్రయం చేసిన నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఫలితంగా సినిమా మంచి ఆదరణనే రాబట్టుకుంది. మంచు మనోజ్‌కి ఇది కమ్ బ్యాక్ ఫిల్మ్. చాలా కాలం తర్వాత ఆయన వెండితెరపై మెరిశాడు. ఈ మల్టీ హీరోల ఫిల్మ్ ఇప్పుడు ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న ప్లాట్ ఫామ్ Zee5 ‘భైరవం’ స్ట్రీమింగ్ వివరాలను వెల్లడించింది.
Also Read- Sonakshi Sinha: ప్రెగ్నెన్సీ కాదు.. ఇలా అయిపోవడానికి కారణం నా భర్తే!
‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ తర్వాత ఈ సినిమానే!
‘భైరవం’ మూవీ జూలై 18 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లుగా తెలుపుతూ.. ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ ‘భైరవం’ చిత్రం జీ5లో ఆడియెన్స్‌కి అందుబాటులోకి రానుంది. థియేటర్లో మంచి ఆదరణను దక్కించుకున్న ఈ చిత్రం.. ఓటీటీలోనూ ఆడియెన్స్‌ను మెప్పిస్తుందని, ముఖ్యంగా ఓటీటీలో ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూసేందుకు ఎంతగానో వెయిట్ చేస్తున్నట్లుగా చిత్రబృందం కూడా ప్రకటించింది. భారతదేశపు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా మారిన ZEE5 తన వీక్షకులు, సబ్ స్క్రైబర్ల కోసం ఎప్పుడూ అద్భుతమైన వినోదాన్ని అందిస్తుందనే విషయం తెలియంది కాదు. తెలుగులో విజయవంతమైన ఒరిజినల్ షోలు, చిత్రాలతో ఆకట్టుకునే ZEE5 ఇప్పుడు ‘భైరవం’ సినిమాతో మరోసారి వార్తలలో హైలైట్ అవుతోంది. ఇటీవల ఇందులో విడుదలైన వెబ్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ మంచి ఆదరణను రాబట్టుకున్న విషయం తెలిసిందే.
Also Read- Hari Hara Veera Mallu: రెండుచోట్ల ‘వీరమల్లు’ ప్రీ రిలీజ్ జాతర.. గెస్ట్‌లు ఎవరంటే?
‘భైరవం’ మూవీ కథ విషయానికి వస్తే..
దాదాపు వెయ్యి కోట్లు విలువైన వారాహి అమ్మవారి ఆలయ భూముల మీద రాజకీయ నాయకుడు కన్నువేయడం, ఆ భూమిని కాపాడేందుకు ధర్మకర్తలైన ముగ్గురు హీరోలు చేసే ప్రయత్నాలు ఏంటి? ఈ ముగ్గురు హీరోల పాత్రలు చివరకు ఎలా ముగుస్తాయి? ఈ క్రమంలో ఎవరెవరు ఏ దారిని ఎంచుకుంటారు? అనేదే ఈ చిత్ర మెయిన్ కాన్సెప్ట్. ఆలయ ధర్మకర్తలుగా గజపతి వర్మ పాత్రలో మంచు మనోజ్, వరద పాత్రలో నారా రోహిత్, శ్రీను పాత్రలో సాయి శ్రీనివాస్ అద్భుతమైన నటనను కనబరిచారు. భూముల కోసం స్నేహితులైన వీరి మధ్య చిచ్చు పెట్టాలనే మంత్రి ఆలోచనలు వర్కవుట్ అయ్యాయా? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే మాత్రం జూలై 18న జీ5లోకి వస్తున్న ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
Powerful. Intense. A story that leaves you with an afterthought – BHAIRAVAM
Get ready for a high voltage thriller
Premieres 18th Jul@BSaiSreenivas @HeroManoj1 @IamRohithNara @DirVijayK @AditiShankarofl @anandhiactress @DivyaPillaioffl @KKRadhamohan @dophari @satyarshi4u pic.twitter.com/3i6s0aKJKI
— ZEE5 Telugu (@ZEE5Telugu) July 8, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు