Sonakshi Sinha
ఎంటర్‌టైన్మెంట్

Sonakshi Sinha: ప్రెగ్నెన్సీ కాదు.. ఇలా అయిపోవడానికి కారణం నా భర్తే!

Sonakshi Sinha: బాలీవుడ్‌లో మాములుగానే పుకార్లు షికారు చేస్తుంటాయి. అలాంటిది హీరోయిన్లపై అయితే ఇంక చెప్పనవసరం లేదు.. ఏ చిన్న హింట్ దొరికినా రూమర్లు చక్కర్లు కొడుతుంటాయి. రీసెంట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) భర్త ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీపై కూడా ఈ విధమైన రూమర్లు వచ్చాయి. ఆయన అక్షయ్ కుమార్ – టైగర్ ష్రాఫ్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తీసిన ‘బడే మియా ఛోటే మియా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిల పడిన విషయం తెలిసిందే. సినిమా ఫ్లాప్‌తో నిర్మాత ఒక్కసారిగా రోడ్డుమీదకు వచ్చేశాడని, ఇప్పుడు తినడానికి కూడా లేదని, ఉన్న ఆస్తులు అన్నీ తాకట్టులో ఉన్నాయని వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా జాకీ భగ్నానీ దీనిపై స్పందించి, ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దు అంటూ కొట్టిపడేశారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) పై రూమర్లు గుప్పు మంటున్నాయి.

Also Read- Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ ఆరోజే విడుదల.. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తాడట!

సోనాక్షి సిన్హాకు జహీర్ ఇక్బాల్‌తో గత ఏడాది పెళ్లి అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె కాస్త లావు అవడంతో ప్రెగ్నెంట్ అయిందంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆమె పెదవి విప్పాల్సి వచ్చింది. తనపై వస్తున్న ప్రెగ్నెంట్ వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పింది. తన భర్తతో చేసిన వాట్సప్ చాట్‌ను బయట పెట్టింది. తన భర్త వల్లే ఆమె అంత లావుగా అవుతున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రతి పది నిమిషాలకు ఏదోటి తెమ్మంటావా తినడానికి.. అంటూ ఆమె భర్త చేసిన చాట్‌‌ను బయట పెట్టింది. అందులో సోనాక్షి ఇప్పుడే కదా భోజనం చేశాను అని చెప్పగా పర్లేదు చెప్పు తెస్తాను అని రిప్లయ్ ఇచ్చారు. ఇలా ఏదోటి తినడానికి తేవడం వల్లే తాను బరువు పెరుగుతున్నా అని చెప్పుకొచ్చారు. అంత మంచి భర్త దొరకడం సోనాక్షి అదృష్టం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read- Ajay Devgn: సీఎం రేవంత్ రెడ్డితో అజ‌య్ దేవ‌గ‌ణ్‌ భేటీ.. పెద్ద స్కెచ్చే వేశాడుగా!

మరో వైపు ఆమె ప్రేమ నుంచి పెళ్లి వరకు ప్రతీది ట్రోలింగ్ అవుతూనే వచ్చింది. ప్రేమలో ఉన్నప్పుడు.. నిజంగా ఆమె ప్రేమలో ఉందా? ఉంటే ఎవరు? అనేలా వార్తలు వచ్చాయి. ఆమె ప్రేమికుడు ఎవరో తెలిసిన తర్వాత, అతనితో సోనాక్షి పెళ్లి అవుతుందా? అందుకు ఫ్యామిలీ అంగకరిస్తుందా? అనేలా టాక్ నడిచింది. అల్లుడుని సిన్హా ఫ్యామిలీ ఇంటికి రానిస్తుందా? అని కూడా కొంతకాలం వార్తలు నడిచాయి. ఎందుకంటే, తండ్రి తన కుమార్తె కోసమే ఈ పెళ్లికి అంగీకరించాడనేలా అప్పట్లో బీభత్సంగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆమె కామ్‌గా తన పని తను చేసుకుంటుంటే.. ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. ఈ వార్తలను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదనేలా ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా అందరికీ సోనాక్షి ఇచ్చిపడేసింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం