rejena serias ( image source : X)
ఎంటర్‌టైన్మెంట్

Regina Cassandra: పెళ్లెప్పుడు అన్నందుకు.. అంత సీరియస్సా?

Regina Cassandra: సాధారణంగా సినీతారల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ప్రేమ, పెళ్లి, వైవాహిక జీవితం గురించి నిత్యం ఏదోక వార్త చక్కర్లు కొడుతుంది. తాజాగా పెళ్లి గురించి వచ్చిన ప్రశ్నలకు ఘాటుగా రియాక్ట్ అయ్యింది ఓ హీరోయిన్. దశాబ్దకాలంగా సినీరంగంలో వరుస సినిమాలతో అలరిస్తున్న హీరోయిన్ రెజీనా కసాండ్రా. ఇప్పటికీ సరైన బ్రేక్ అందుకోలేదు. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో యంగ్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ వెండితెరపై సందడి చేశారు. 2005లో విడుదలైన తమిళ చిత్రం ‘కండనాల్ మొదల్’ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు రెజీనా. ఆ తర్వాత ఆమె నటించిన సినిమా అసురతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. విభిన్న చిత్రాలు.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ కొన్నాళ్లుగా ఈ బ్యూటీకి సరైన హిట్ రావడం లేదు. ఇప్పుడు సినిమాలతోపాటు వెబ్ సిరీస్ సైతం చేస్తుంది. అలాగే విలన్ పాత్రలలోనూ అద్భుతమైన నటనతో అదరగొడుతుంది.

Also Read –Trott on Kohli: లండన్‌లో కోహ్లీ అడ్రస్ లీక్.. అడ్డంగా బుక్ చేసిన మాజీ క్రికెటర్!

సినీ రంగంలో అడుగుపెట్టి చాలా కాలం అవుతున్నప్పటికీ రెజీనా కసాండ్రా పెళ్లి గురించి ఇప్పటి వరకు ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రస్తుతం రెజీనాకు 34 సంవత్సరాలు దాటడంతో నెటిజన్లు ఆమె పెళ్లి గురించి ఆరా తీస్తున్నారు. రెజీనా ఏ ఈవెంట్‌లో కనిపించినా ఆమె పెళ్లి గురించే అడుగుతున్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీంతో పట్టలేని కోపంతో ఆ యాంకర్‌పై విరుచుకు పడింది. ఆమె తల్లే తన పెళ్లి గురించి అడగడం లేదని, మీరు ఎందుకు అడుగుతున్నారంటూ మండిపడ్డారు. తనతో ఎవరైనా రిలేషన్స్ పెట్టుకుంటే వారికే కష్టం అవుతుందని ఘాటుగా స్పందించారు.

Also Read –Indiramma Houses: పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు.. రాబోయే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా ఐటెంసాంగ్ చేయడంలోనూ తన మార్క్ చూపించుకున్నారు. ‘ఆచార్య’ సినిమాలో ‘సానా కష్టం’ సాంగ్‌లో ఆడి పాడింది. రెజీనా తాజాగా నటించిన రెండు చిత్రాలు ‘కేసరి చాప్టర్ 2’ జాట్ సినిమాలు మంచి విజయాలనే అందుకున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా అబ్బాయిల గురించి హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అబ్బాయిలు, మ్యాగీ రెండు నిమిషాల్లో అయిపోతాయని ఆమె అన్న మాటలు అప్పుడు వైరల్‌గా మారాయి. ఆ తర్వాత మరోసారి తన గురించి తానే చేసుకున్న కామెంట్స్ మరోసారి వైరల్ అయ్యాయి. అబ్బాయిలతో రిలేషన్ గురించి ఓ రిపోర్టర్ అడగ్గా తాన జీవితంలో చాలా రిలేషన్స్ ఉన్నాయని తానొక సీరియల్ డేటర్‌ని అని చెప్పుకొచ్చారు. అప్పటి యంగ్ హీరోలు, సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్ లాంటి వాళ్లతో రెజీనా డేటింగ్ చేసిందని రూమర్స్ వచ్చాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు