Kaushik Reddy
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Kaushik Reddy: పేదోళ్ల పొట్టకొట్టిన కౌశిక్ రెడ్డి.. లబోదిబో అంటున్న జనం!

Kaushik Reddy: బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు. ఎందుకంటే ఆయన నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లోనే నిలుస్తుంటారు. ఇదంతా ఆయనలోని ఓ యాంగిల్ అయితే.. తాజాగా మరో యాంగిల్ బయటపడింది. ఆయన ప్రత్యర్థులను సూటిపోటి మాటలు, అంతకుమించి వివాదాస్పద వ్యాఖ్యలు.. వివాదాల్లో తలదూర్చడమే చూశాం కదా. ఇప్పుడు పేదోళ్ల పొట్టకొట్టి వాళ్ల ఉసురు పోసుకుంటున్నారు. నిజంగా కౌశిక్ చేసిన మోసం, దగా.. కుట్ర చూస్తే చీ.. ఛీ ఇంత మోసగడా..? అనుకుంటారేమో..! ఇంతకీ ఆయనేం చేశారు? ఎందుకిలా జనం లబోదిబో అంటున్నారనే విషయాలు చూద్దాం రండి..!

Kalayana Lakshmi Cheque

Read Also- Congress: కాంగ్రెస్‌కు ఊహించని ఝలక్.. బీజేపీలోకి బడా లీడర్

ఇదీ అసలు సంగతి..
నెలల కాలంపాటు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల కోసం లబ్దిదారులు పడిగాపులు పడితే.. ప్రభుత్వం అందించిన చెక్కులను కాలం చెల్లిన తరువాత లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సకాలంలో చెక్కులు పంపిణీ అయ్యేలా చూడాల్సిన అధికారులు మొద్దునిద్రలో ఉంటే తనను ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేయనివ్వడం లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. చెక్కులు వచ్చిన సకాలంలో పంపిణీ చేయకుండా కాల పరిమితి అయిపోయాక పంపిణీ చేశారు. చెక్కులు వచ్చాయని సంతోషంతో చెక్కులు బ్యాంకులో వేసి క్రాస్ చేసుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లారు. తీరా చూస్తే.. బ్యాంకులో ఆధికారులు చెప్పిన మాట విని కంగు తిన్నారు. ‘ మీరు తెచ్చిన చెక్కుల కాల పరిమితి అయిపోయింద’ని బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో వారు లబోదిబో మంటూ అధికారుల వద్దకు పరుగులు తీశారు. కాలం చెల్లిన చెక్కులు ఎలా ఇస్తారని అధికారులను నిలదీశారు. దీంతో తేరుకున్న అధికారులు చెక్కులు ప్రభుత్వంకు పంపించి సరిచేసి పంపిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులకు మూడు నెలల కాల పరిమితి ఉండగా పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఇంతకాలం వేచి చూసి మూడు నెలలు దాటిన తర్వాత చెక్కులు పంపిణీ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో అనేక మందికి కాలం చెల్లిన చెక్కులు పంపిణీ చేసి లబ్ధిదారులను ఇబ్బందుల్లో పడేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Kaushik Reddy Cheque
Kaushik Reddy Cheque

పనికిరాకుండా చేసేందుకేనా?
పాడి కౌశిక్ రెడ్డి తనను ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులు పంచనివ్వడం లేదని కోర్టుకు వెళ్లి ఆర్డర్ తీసుకొచ్చి చెక్కులు పంచేందుకు అవకాశం పొందారు. తమకు వచ్చిన చెక్కులను పనికిరాకుండా చేసేందుకేనా? ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నది అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. పేదోళ్ల పొట్ట కొట్టడం ఏమిటి..? రాజకీయంగా ఏమైనా ఉంటే చూసుకోవాలి కానీ, ఇలా చేయడమేంటి? అని జనాలు మండిపడుతున్నారు. దీనిపై కౌశిక్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి. కాగా, ఇటీవల కౌశిక్ రెడ్డి ఒక గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ విషయంలో ఆయనకు హైకోర్టులో కొంత ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్లను పలుమార్లు కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

Read Also- Ajay Devgn: సీఎం రేవంత్ రెడ్డితో అజ‌య్ దేవ‌గ‌ణ్‌ భేటీ.. పెద్ద స్కెచ్చే వేశాడుగా!

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?