Vijay Devarakonda in Kingdom
ఎంటర్‌టైన్మెంట్

Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ ఆరోజే విడుదల.. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తాడట!

Kingdom: టాలీవుడ్‌లో రూపుదిద్దుకుంటోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది వరకే విడుదలైన టీజర్‌తో పాటు ‘హృదయం లోపల’ అనే సాంగ్ మంచి ఆదరణను రాబట్టుకున్నాయి. ఈ సినిమా విడుదల కోసం విజయ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో వేచి చూస్తున్నారు. కారణం విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని వేచి చూస్తున్న వారందరికీ కోసం.. తాజాగా చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. (Kingdom Movie Release Date)

Also Read- Sehwag Son: సెహ్వాగ్ పెద్ద కొడుకు సంచలనం.. వేలంలో భారీ ధర

‘కింగ్‌డమ్’ సినిమా 31 జూలై, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ.. పవర్ ఫుల్ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసేలా ఉంది. యాక్షన్, హీరోయిజం, డ్రామా కలిసి శక్తివంతమైన చిత్రంగా ‘కింగ్‌డమ్’ రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రోమోలో యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగాలు, విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. ముఖ్యంగా డైలాగ్ బాగా వైరల్ అవుతోంది. ‘ఏమైనా చేస్తా సార్.. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్’ అనే డైలాగ్ హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. అలాగే ఈ సినిమా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నట్లుగా ఈ ప్రోమో తెలియజేస్తుంది. ఇక ఈ నెలలోనే విడుదల ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Also Read- Venkatesh: చిరు-అనిల్ సినిమాలో గెస్ట్ రోల్.. వెంకీ మామ ఏమన్నారంటే..

తాజాగా విడుదల తేదీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా నిర్మాతలు స్పందిస్తూ.. ‘కింగ్‌డమ్’ కేవలం సినిమా కాదు. ఇది మేము ఎంతో ఇష్టంతో నిర్మించిన ఒక గొప్ప ప్రపంచం. ప్రతి ఫ్రేమ్ మరపురానిదిగా ఉండాలని మేము కోరుకున్నాం. జూలై 31న ఈ చిత్రం బాక్సాఫీస్ తుఫానుకు నాంది పలుకుతుందని అన్నారు. ప్రస్తుతం ఈ ‘కింగ్‌డమ్’ రిలీజ్ డేట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అద్భుతమైన విజువల్స్, సంగీతంతో రూపొందిన ఈ ప్రోమో అభిమానుల ప్రశంసలను సైతం అందుకుంటోంది. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా కోసం అద్భుతమైన కథను రెడీ చేశారని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారని మేకర్స్ తెలుపుతున్నారు. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం కచ్చితంగా విజయ్ దేవరకొండకు మరుపురాని విజయాన్ని ఇస్తుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?