102 Seats 16 Crore Voters Stage Set For First Phase Of ls Polls
Politics

Polling: తెలంగాణలో ముగిసిన పోలింగ్.. 5 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

Elections: తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. సాయంత్రం ఐదు గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలను సీఈవో వివరించారు. పూర్తి వివరాలు వెలువడటానికి మరింత సమయం పడుతుందని తెలిపారు. సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాల వారీగా, ఇతర రాష్ట్రాల్లోనూ నమోదైన పోలింగ్ శాతం వివరాలు తెలుసుకుందాం.

మన రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక కూడా జరిగింది. సాయంత్రం 5 గంటల కల్లా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 61.16 శాతం పోలింగ్ నమోదైంది. కంటోన్మెంట్ స్థానంలో 47.88 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక 17 లోక్ సభ స్థానాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు చూస్తే..

ఆదిలాబాద్‌లో 69.81 శాతం

భువనగిరిలో 72.34 శాతం

చేవెళ్లలో 53.15 శాతం

హైదరాబాద్‌లో 39.17 శాతం

కరీంనగర్‌లో 67.67 శాతం

ఖమ్మంలో 70.76 శాతం

మహబూబాబాద్‌లో 68.60 శాతం

మహబూబ్‌నగర్‌లో 68.40 శాతం

మల్కాజిగిరిలో 46.27 శాతం

మెదక్‌లో 71.33 శాతం

నాగర్ కర్నూల్‌లో 66.53 శాతం

నల్గొండ‌లో 70.36 శాతం

నిజామాబాద్‌లో 67.96 శాతం

పెద్దపల్లి‌లో 63.86 శాతం

సికింద్రబాద్‌లో 42.48 శాతం

వరంగల్‌లో 64.08 శాతం

జహీరాబాద్‌లో 71.91 శాతం

సాయంత్రం ఐదు గంటలకల్లా గరిష్టంగా భువనగిరిలో 72.34 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.17 శాతం పోలింగ్ నమోదైంది.

ఈ నాలుగో విడతలో భాగంగా తెలంగాణతోపాటు మరో 8 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్‌లోని 96 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు 96 లోక్ సభ స్థానాల్లో మొత్తంగా 62.31 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతాలను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 68.04 శాతం

బీహార్‌లో 54.14 శాతం

జమ్మూ కాశ్మీర్‌లో 35.75 శాతం

జార్ఖండ్‌లో 63.14 శాతం

మధ్యప్రదేశ్‌లో 68.01 శాతం

మహారాష్ట్ర‌లో 52.49 శాతం

ఒడిశాలో 62.96 శాతం

తెలంగాణలో 61.16 శాతం

ఉత్తర ప్రదేశ్‌లో 56.35 శాతం

పశ్చిమ బెంగాల్‌లో 75.66 శాతం

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!