Forest Lands( IMAGE credit: twitter or free pic)
తెలంగాణ

Forest Lands: భూముల గుర్తింపునకు ఎక్స్‌పర్ట్​ కమిటీ!

Forest Lands: రాష్ట్రంలో అటవీ భూములు (Forest Lands) కబ్జా కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే భూముల (Lands) గుర్తింపునకు ఎక్స్‌పర్డ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రభుత్వ భూములను గుర్తించడంతో పాటు చెట్లు, పొదలు ఉంటే డీమ్డ్ ఫారెస్టుగా గుర్తించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కమిటీ ఏం చేయాలి, ఎలా ముందుకు పోవాలనే అంశాలపై పలు సూచనలు చేసినట్లు తెలిసింది. రెండు నెలల్లో కేంద్ర పర్యవరణ శాఖకు నివేదిక ఇవ్వాలని గడువు పెట్టినట్లు సమాచారం. సీఎం ఆదేశాలతో కమిటీ ముందుకు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రత్యేక ప్రణాళికతో ముందుకు..

అటవీ భూముల (Forest Lands) సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నది. అటవీ ప్రాంతంగా పరిగణించదగిన భూములు, అడవి లక్షణాలు కలిగిన ప్రాంతం, అడవి బయట ఉన్న (Lands) భూములను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ చేపడుతున్నది. అలాంటి భూమి (Land)ఎవరి ఆధీనంలో ఉన్నా, జాబితాలో చేర్చాలని భావిస్తున్నది. అధికారికంగా అడవులుగా వర్గీకరించబడని ప్రాంతాలతోపాటు అర్హత పొంది ఉన్న (Lands)భూములను గుర్తించి వాటిని డాక్యుమెంట్ చేయనున్నది. చట్టబద్ధంగా అటవీ ప్రాంతంగా ప్రకటించకపోయినా, వర్గీకరించకపోయినా అటవీ ప్రాంత లక్షణాలు ఉంటే కమిటీ ఫీల్డ్​ సర్వే చేసి డీమ్డ్ ఫారెస్ట్‌గా గుర్తించనున్నది.

 Also Read: Medchal News: పుట్టగొడుగుల్లా వెలుస్తున్న రసాయన పరిశ్రమలు

అంతేకాకుండా గవర్నమెంట్​ ల్యాండ్స్​ ఉండి ఆ ప్రాంతంలో దట్టమైన చెట్లు, పొదలు పెరిగితే వాటిని కూడా ఈ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. గతంలో అటవీ భూములుగా ఉంటూ కాలక్రమంలో వనరహితంగా, ఖాళీగా మారిపోయిన భూములను కూడా గుర్తించేందుకు సిద్ధమైంది. మొక్కలు నాటి పెంచిన ప్రాంతాలను గుర్తించి అవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయో, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయో గుర్తించే పనిలో నిమగ్నమైంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా అటవీ, (Forest ) ప్రభుత్వ భూములకు సంబంధించి సమగ్ర నివేదికను తయారు చేయబోతున్నది.

నిపుణుల కమిటీ

అన్ని రాష్ట్రాల్లో అటవీ భూమి తగ్గుతుండడంతో దానిని కాపాడేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం భూముల గుర్తింపు కోసం కమిటీని ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ప్రకటించింది. ఆ కమిటీలో అదనపు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీ సీఎఫ్) చైర్​ పర్స​న్‌గా ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.

ఇందులో వైల్డ్​ లైఫ్​ నిపుణుడు, రిటైర్డ్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శంకరన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్​ఆర్​ఎస్​ఏ) చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధులు, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మాధవరావు, ఖమ్మం జిల్లా అటవీ అధికారి, రాజన్న ఆటవీ సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ అటవీ భూముల గుర్తింపు, వాటిని డాక్యుమెంట్​ చేయనున్నది.

రెండు నెలల్లో సుప్రీంకోర్టుకు రాష్ట్రంలోని అటవీ భూములపై నివేదికను అందజేయనున్నది. దీని ద్వారా అటవీ భూముల రక్షణతోపాటు అటవీయేతర భూముల పరిరక్షణకు దోహద పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. అంతేకాకుండా, పోరంబోకు, రెవెన్యూ, దేవాదాయ, ఇతర ప్రభుత్వ భూములకు ఈ కమిటీ రక్షణ కవచంగా నిలుస్తుందని అనుకుంటోంది. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ నిబంధనల అమలుతోపాటు భవిష్యత్​ పులుల తరలింపునకు ఉపయుక్తంగా ఉంటుందని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

 Also Read:Private Education: ప్రైవేట్ విద్యాసంస్థలా మజాకా?.. ఆపేవారు ఎవరు?

రాష్ట్రంలో 27,688 చ.కి.మీ. అటవీ భూమి

రాష్ట్రంలో అటవీ, అటవీయేతర భూముల ( Lands) గుర్తింపు, సంరక్షణ, భూ నమోదు పత్రాల సిద్ధం కోసం ప్రభుత్వ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, డీమ్డ్​ ఫారెస్ట్‌గా గుర్తించదగిన భూమి ఎంత ఉంది. అడవి కాని భూములు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయనే దానిపై కమిటీ తర్వలోనే భేటీ కానున్నది. రెవెన్యూ, అటవీ శాఖల సమన్వయంతో జాయింట్ సర్వేలు నిర్వహించనున్నారు. అక్షాంశ, రేఖాంశాలను ఉపయోగించి అటవీ భూముల హద్దులను గుర్తించనున్నారు. ఆక్రమణలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.

(Forest Lands)అటవీ భూములను రియల్ ఎస్టేట్, మైనింగ్, లేదా ఇతర కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఈ కమిటీ దోహదం పడుతుంది. రాష్ట్రంలో మొత్తం 27,688 చదరపు కిలోమీటర్ల అటవీ భూమి ఉంది. ఇది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 24.69శాతం. అయితే, ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ 2023 ప్రకారం రెండేండ్లలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం తగ్గింది. 2021 – 23 మధ్య కాలంలో 100.42 చ.కి.మీ. అటవీ భూమి (Forest Lands) తగ్గింది. ఈ తగ్గుదలలో తెలంగాణ దేశంలోనే మూడవ స్థానంలో ఉంది.

ప్రతి ఏటా మొక్కలు నాటుతున్నా..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా వన మహోత్సవం నిర్వహిస్తున్నది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో అటవీ విస్తీర్ణం పెరగడం లేదు. మరోవైపు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబ్ నగర్ (Mahabubnagar) లోని కొన్ని ప్రాంతాలు, భూపాలపల్లి, మహబూబాబాద్, (Mahbubabad) నిర్మల్, ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాల్లో ఆటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వేసిన కమిటీ ఏం నివేదిక ఇస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎంత పారెస్ట్ భూమి రాష్ట్రంలో ఉందనేది స్పష్టంగా తెలియనుంది. ఆ భూముల రక్షణకు ప్రభుత్వం (Government)  సైతం ఇంకా ఎలాంటి చర్యలు చేపడుతుందనేది చూడాలి.

 Also Read: Viral News: నాగుపామును చంపిన పశువుల కాపరులు.. ఫొటో తీసి చూడగా షాకింగ్ ఘటన

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు