RK Sagar Speech at The 100 Event
ఎంటర్‌టైన్మెంట్

RK Sagar: త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ‘ది 100’

RK Sagar: ఆర్కే సాగర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జూలై 11న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక (The 100 Pre Release Event)ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సాగర్ మాట్లాడుతూ..

Also Read- Kavya and Shivathmika: కావ్య, శివాత్మికల ఆ కోడింగ్‌ సంభాషణకు అర్థమేంటో తెలుసా?

‘‘ఈ ప్రీ రిలీజ్ వేడుక ఫ్యామిలీ ఫంక్షన్‌లా అనిపిస్తుంది. మెగా మదర్ అంజనమ్మ నా సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు. వారికి ధన్యవాదాలు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించారు. వారికి ధన్యవాదాలు. సజ్జనార్ సార్, నాగబాబు సార్ అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సార్ ట్రైలర్‌ని లాంచ్ చేస్తే.. సినిమా అందరికీ రీచ్ అవుతుందని ఆయన్ని వెళ్లి అడిగాను. ఆయన మా ట్రైలర్‌ని లాంచ్ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి ధన్యవాదాలు. ఐటి మినిస్టర్ శ్రీధర్ అన్నతో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది. ఆయన సినిమా చూసి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. మంత్రి కోమటిరెడ్డి సార్‌కు థాంక్యూ. మాకు బ్లెస్ చేయడానికి రావడం చాలా ఆనందంగా ఉంది. మా నిర్మాతలతో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది. వారి సపోర్ట్‌ని మర్చిపోలేను. డైరెక్టర్ శశి చాలా ఫ్యాషన్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాతో ఆయన మంచి పొజిషన్‌కు వెళ్లాలని కోరుకుంటున్నాను. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి పనిచేసిన అందరూ కూడా చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

Also Read- Thug Life OTT: ‘అన్నా.. నేనెవర్ని’.. ‘థగ్ లైఫ్’ని ఓటీటీలో చూసిన నెటిజన్ పోస్ట్ వైరల్!

ఈ సినిమా ఒక వెపన్ లాంటిది. ఈ కథ విన్నప్పటి నుంచి ఆడియన్స్‌కి ఎప్పుడెప్పుడు చూపించాలా? అని ఎంతో ఎక్జయిట్‌మెంట్ ఉండేది. ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి తప్పకుండా ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ‘ది 100’. ఇది రాసి పెట్టుకోండి. ఈ సినిమాకి అంత పవర్ ఉంది. అందుకే అంత నమ్మకంగా చెబుతున్నాను. ఈ సినిమా మస్ట్‌గా చూడాలి. కమర్షియల్ మూవీ. వెరీ టచింగ్ పాయింట్ ఇందులో ఉంది. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఫ్యామిలీ థియేటర్‌కు వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అందరూ థియేటర్స్‌లో చూసి బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?