Thug Life Poster
ఎంటర్‌టైన్మెంట్

Thug Life OTT: ‘అన్నా.. నేనెవర్ని’.. ‘థగ్ లైఫ్’ని ఓటీటీలో చూసిన నెటిజన్ పోస్ట్ వైరల్!

Thug Life OTT: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కిన హై-యాక్ష‌న్‌ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’. ఈ భారీ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఓటీటీలో ఈ సినిమా మంచి ఆదరణనే రాబట్టుకుంటోందనేలా టాక్ వినబడుతున్నా.. చూసిన వారు మాత్రం ఒక మాదిరిగా రియాక్ట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాను ఓటీటీలో చూసిన ఓ నెటిజన్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ నెటిజన్ చేసిన పోస్ట్ యథాతధంగా..

Also Read- Kavya and Shivathmika: కావ్య, శివాత్మికల ఆ కోడింగ్‌ సంభాషణకు అర్థమేంటో తెలుసా?

‘‘నిన్నటి సాయంత్రము ఒకానొక చారిత్రక తప్పిదము సంభవించినది.
గత నెలయందు అత్యంత తిరస్కరణకు గురైన thug life నీచచిత్రరాజము OTT నందు ప్రవేశము చెయ్యగానే కల్ట్ క్లాసిక్కుగా విరాజిల్లునేమోనన్న చిత్తభ్రమలు కలిగినవి.. బలమైన తారాగణము, ఘనమైన సాంకేతికదళమూ కలిగిన ఆ చిత్రముని ఒకసారి చూచి తరించమని నన్ను పురిగొల్పినవి..
సరే, ఎన్ని ఆటంకములు ఎదురైననూ చూసి తీరవలెనన్న కృతనిశ్చయముతో టీవి ముందు కూర్చుండినాను..
ఒకానొక దురదృష్ట సమయమున చిత్రము ప్రారంభమైనది..
అర్ధనిమిషములో పూర్తి కావాల్సిన సన్నివేశమును ‘తనదైన ప్రత్యేక టేకింగు’ పేరిట రెండున్నర నిమిషములపాటు బెండపూడి జీడిపాకం వలె సాగదీయుచూ, ప్రేక్షక సహనానికి పరీక్ష పెట్టుచున్నాడు మణిరత్నము సారువాడు.. కమలుడు, నాజరుడు వంటి వయోవృద్ధ సమూహముతో కలసి మూకుమ్మడిగా చేయుచున్న ఆ ముప్పేటదాడికి మొదటి పావుగంటకే పదిలంఖణాలు చేసినంతటి నీరసము వచ్చిపడినది..
ఎట్లాగో ఓర్చుకొని ముందుకి జరిపినాను..
చెవులకు వినబడుచున్న కర్ణకఠోర నేపథ్య సంగీతమునకు, కంటిని పీడించుచున్న సన్నివేశమునకు పొంతన కుదరక, టీవీనందు ఒకేమారు రెండు చిత్రములుగానీ ప్లే అవుచున్నాయా ఏమని శిరమును గోకుకొని, పలుమార్లు టీవీని పరీక్షించుకుంటిని..
అటువంటి ద్విచిత్ర ప్రదర్శన ఏమీ జరగడంలేదని రూఢీ పరచుకుని, అది రెహమానుడి పైత్యమని నిర్ధారించుకుని నివ్వెరపోయితిని.. ఏమి చేయుదుము..? కాలమహిమ..!!
కాకరకాయముక్కలను కరక్కాయ పచ్చడినందు నంజుకుని తిన్న మాదిరి కటిక చేదుగా అనిపించుచూ, యే సన్నివేశమునకు ఆ సన్నివేశము ఒకదానితో మరియొకటి పోటీపడుచున్నాయి మిక్కిలి శిరోవేదనకు కారణమగుటలో..

Also Read- Naga Chaitanya: చైతూ అప్పటి వీడియో ఇప్పుడెందుకు వైరలవుతోంది.. సమంతే కారణమా?

మరో అర్ధగంటపాటు ఏలనో భరించినాను ఈ వేదనను.. అంతట సంభవించినది ఒకానొక భయంకర ఉత్పాతము..
నడుము ఒంగిన కమలుడు జైలుకి చేరినాడు.. అచ్చట పోషకాహార లోపముతో బాధపడుచున్నట్టు అగుపించుచున్న బలహీన త్రిషను చూచినాడు..
చూచి సంతోషించి ఆగినాడా అంటే లేదు..
వృద్ధ కమలుడు, ముడతలు పడ్డ త్రిష వెనుకగా చేరి యథాప్రకారం జుట్టు మీద తలకాయ పెట్టి శృంగారం ఒలికించసాగినాడు.. ఆ యొక్క వృద్ధరొమాన్సుని చూచిన నేను ఒక్కసారిగా ఉలిక్కిపడి, వేడిగా త్రాగుచున్న రాగిజావను అమాంతం కక్కుకోబోయినాను.. యన్ కడవులే.. 🙏🙏
భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆఘమేఘాల మీద చిత్రము నిలిపివేసినాను..
యుద్ధప్రాతిపదికన ఇరు తెలుగురాష్ట్రాల ప్రభుత్వపెద్దలచే తమిళనాడు ప్రభుత్వమునకు సిఫార్సు చేయించి, ఈ గతి తప్పిన మతిలేని వృద్ధమూక అంతటికీ ఏదొక పునరావాస పథకము కల్పించకపోయినచో, ఇటువంటి మరిన్ని దారుణములకు పాల్పడెదరేమోనని క్షణకాలం పాటు భయభ్రాంతులు కలిగినవి..
ఏది ఏమైననూ నా యొక్క జీవితమునందు పూర్తి చెయ్యవలసిన బాధ్యతలు, తీర్చవలసిన ఋణములు అన్నియూ జ్ఞప్తికి వచ్చి, తటాలున చిత్రప్రదర్శన నిలిపివేసి, స్వేచ్ఛా వాయువులు పీల్చుకునటకై బయటకి పోయితిని..’’

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ