Naga Chaitanya: గతంలో ‘లాల్ సింగ్ చద్దా’ (Lal Singh Chaddha) సినిమా ప్రమోషనల్ వీడియోలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అందులో తన ఫస్ట్ క్రష్ గురించి చైతూ తెలిపారు. ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ప్రమోషన్స్ సమయంలో బాలీవుడ్‌లో ఎవరితో పనిచేయాలని ఉంది అని యాంకర్ ప్రశ్నించగా.. చైతూ.. తనకు మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్ అంటే చాలా ఇష్టమని.. ఆమెతో పని చేయాలని ఉందని తెలిపారు. ఇదే విషయాన్ని సుష్మితా సేన్‌తో కూడా చెప్పానన్నారు. అలాగే మరికొందరు ఇష్టమైన వారి గురించి కూడా ప్రస్తావించారు.
Also Read- NASA: సౌరవ్యవస్థలో వింత.. విశ్వంతరాల నుంచి ప్రవేశించిన కొత్త వస్తువు
బాలీవుడ్‌లో అలియా భట్ యాక్టింగ్‌కు తను ఫిదా అయిపోతానన్నారు. ఆమెతో సినిమా ఛాన్స్ వస్తే అసలు వదులుకునే ప్రసక్తే లేదన్నారు. అలాగే ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, కత్రినా కైఫ్ వంటి వాళ్లతో నటించాలని ఉందని తెలిపారు. బయోగ్రఫీ రాయాల్సి వస్తే టైటిల్ ఏం పెడతారు అని యాంకర్ అడగ్గా.. ‘జీవితాన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దు’ అనే టైటిల్ పెడతానన్నారు. అనుకోకుంగా ఏదైనా ఐల్యాండ్‌లో చిక్కుకుపోతే తనకు ఇష్టమైన మ్యూజిక్ ఉండాలని, అక్కడ తన మనసుకు నచ్చిన మహిళ ఉంటే తనతో మాట్లాడుకుంటూ ఉండిపోతానని చైతూ చెప్పుకొచ్చారు.
అయితే ఈ వీడియో వైరల్ అవడానికి కారణం లేకపోలేదు. తన మాజీ భార్య సమంత (Samantha).. అమెరికాలో ‘తానా 2025’ సభలో తన మొదటి సినిమా గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయింది. ‘నేను నా జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా.. తెలుగు ఫ్యాన్స్ గురించి ఆలోచించే తీసుకుంటాను ఎందుకంటే, వారు నా మొదటి సినిమా నుంచి సపోర్ట్ చేస్తున్నారు. తెలుగు ఆడియన్స్ ఎంత దూరంగా ఉన్నా.. నా మనసుకు దగ్గరగా ఉంటారు’ అని చెప్పుకొచ్చింది. సమంత ఏమో.. ఇంకా చైతూ జ్ఞాపకాలతోనే ఉంది. కానీ, చైతూ మాత్రం వేరే ఎవరెవరితోనో నటించాలని అనుకుంటున్నాడంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు.
Also Read-Sandeep Raj: ‘సి’ దెబ్బకు దిగొచ్చిన సందీప్ రాజ్.. సీన్ మొత్తం మారిపోలా!
ఇక తండేల్ సినిమాతో అక్కినేని నాగచైతన్య రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టాడు. దీనికి చందు మొండేటి దర్శకత్వం వహించగా.. సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ సినిమా చైతూ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. రూ.100 కోట్లు వసూలు చేసి చైతూ కెరీర్‌లో ఓ మైలు రాయిని సెట్ చేసింది. దీంతో నాగచైతన్య ‘తండేల్’ తర్వాత చెయ్యబోయే ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
మంచి కథా బలం ఉన్న చిత్రాలను ఎంచుకునే నాగచైతన్య మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. ‘విరూపాక్ష’ వంటి సంచలన విజయం తర్వాత దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నాగ చైతన్య తన NC24 సినిమా చేస్తున్నారు. నాగ చైతన్య కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న చిత్రమిది. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూలు కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత చైతూ రేంజ్ మారిపోతుందని అభిమానులు అశిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.