Vijay Sethupathi: సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అదీ తాను చేసిన పనికి అయితే కాదు. మరెందుకంటే విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి (Surya Sethupathi) ‘ఫీనిక్స్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటరైన విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదలై మంచి టాక్ కూడా తెచ్చుకుంది. అయితే పెద్దగా కలెక్షన్స్ అయితే రాబట్టలేక పోయింది. ‘ఫీనిక్స్’ సినిమా ప్రీమియర్ షోలో ఈ వివాదం నెలకొంది. ప్రీమియర్ షో, ప్రమోషన్ల సమయంలో సూర్య సేతుపతి ప్రవర్తనపై మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల వీడియోను తొలగించాలంటూ సూర్య టీమ్ మీడియాపై తీవ్ర ఒత్తిడి తెచ్చిందంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై విజయ్ సేతుపతి స్పందించారు. వైరల్ వార్తలపై వివరణ ఇచ్చారు.
Also Read- Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్ అయినట్టే!
తన కొడుకు సూర్య సేతుపతి చేసిన పనికి విజయ్ సేతుపతి నేరుగా మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు కోరారు. ప్రీమియర్ షో, ప్రమోషన్ల సమయంలో జరిగిన వివాదంపై ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని కోరారు. ఫీనిక్స్ మూవీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందడంతో మాస్ ప్రేక్షకుల నుంచి మంచి టాక్ సంపాదించుకుంది. కాకపోతే ప్రమోషన్ సమయంలో జరిగిన వివాదం వల్ల కొంత కలెక్షన్లు తగ్గాయని చెప్పవచ్చు. వారంతానికి అయినా మంచి వసూళ్లు రాబడతాయని మూవీ టీమ్ ఆశిస్తుంది. విజయ్ సేతుపతి బయటికి వచ్చి క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి తెరపడిందనే చెప్పవచ్చు. ఇప్పటికైనా సినిమా పుంజుకుని మంచి వసూళ్లు రాబడుతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఈ సినిమాలో దేవదర్శిని, వరలక్ష్మి శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read- BJP Vs Congress: బీజేపీ, కాంగ్రెస్ మధ్య లేఖల వార్
ఈ సినిమాలో సూర్య నటన చూసి తండ్రికి తగ్గ తనయుడని అంతా కితాబిస్తున్నారు. ఒకే రోజు సిద్దార్థ్ మూవీ ‘3బీహెచ్‌కే’ (3BHK), ‘ఫీనిక్స్’ (Phoenix) విడుదలవడంతో సూర్య సినిమా కలెక్షన్స్‌లో కొంత కోత పడింది. విడుదల రోజు ఈ చిత్రానికి కేవలం రూ. 10 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. సూర్య ప్రవర్తన మార్చుకుంటే రానున్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తాయని అభిమానులు కోరుతున్నారు. ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫర్, ఫైట్ మాస్టర్ ఎమ్ ఏ అరసుకుమార్ దర్శకత్వం వహించారు. సామ్ సిఎస్ అందించిన సంగీతం యాక్షన్‌కు తగ్గట్టుగా ఉంది. యాక్షన్ సన్నివేశాలు రియలిస్టిక్‌గా రావడానికి సూర్య ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో యాక్షన్ సీన్లు అనుకున్నట్లుగానే వచ్చాయి. యాక్టింగ్ విషయంలో అయితే మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించారు సూర్య సేతుపతి. జూలై 4న ‘ఫీనిక్స్’ చిత్రం విడుదలైంది. ఇక సూర్య అతి చూసిన వారంతా.. ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ సలహాలు ఇస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.