Parag Tyagi: ప్రముఖ పాప్ సింగర్, టీవీ నటి, ‘కాంతా లగా’ ఫేమ్ షెఫాలి జరివాలా (Shefali Jariwala) ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు కేవలం 42 సంవత్సరాలే. జూన్ 27 రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో ఆమె అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆమె భర్త, నటుడు పరాగ్ త్యాగి వెంటనే గమనించి హాస్పిటల్‌కు తీసుకెళ్లినా, దారి మధ్యలోనే ఆమె ప్రాణం పోయింది. దీంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఆమె మృతికి కారణం ఏంటనే దానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఆమె కొంత కాలంగా యాంటీ ఏజింగ్ మందులు, ఇంజెక్షన్లు తీసుకోవడం కారణంగానే, గుండెపోటు వచ్చిందని అంతా భావిస్తున్నారు. ఆమె మృతి అనంతరం నిర్వహించిన పోస్ట్‌మార్టం రిపోర్ట్ మాత్రం బయటకు రానివ్వడం లేదు. అలాగే, ఆమె ఎలా చనిపోయిందనే దానిపై కూడా సరైన క్లారిటీ ఇవ్వకపోవడం విశేషం.
Also Read- Rakul Husband: ఆ సినిమా ఫ్లాప్‌తో రోడ్డు మీదకి.. రకుల్ భర్త స్పందనిదే!
ఇదిలా ఉంటే.. 42 ఏళ్ల భార్య మృతిని భర్త పరాగ్ త్యాగి (Parag Tyagi) జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తన భార్యపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ.. అందరినీ భావోద్వేగానికి గురి చేస్తున్నారు. పరాగ్ త్యాగి తన భార్య షెఫాలీ జరీవాలా మరణించిన కొన్ని రోజుల తర్వాత ఆమెతో గడిపిన క్షణాలను పంచుకుంటున్నారు. తాజాగా ఆయన ఇప్పటి వరకు ఆ జంటకు సంబంధించి బయటకు రాని ఫొటోలతో ఓ వీడియోను షేర్ చేశారు. దీనికి ‘‘పరీ.. నువ్వు పుట్టిన ప్రతిసారి నేను కనుగొంటాను. ప్రతి జన్మలో నిన్ను ప్రేమిస్తాను. ఐ లవ్ యూ ఎటర్నల్లీ మేరీ గుండీ మేరీ చోక్రీ’’ అని చెబుతూ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలోని క్యాండిడ్ పిక్స్, ఈ జంట ఒకరితో ఒకరు ఎంత ఆప్యాయంగా ఉండేవారో తెలియజేసేలా ఉన్నాయి. ఈ పోస్ట్‌కు ఈ దంపతుల స్నేహితులు, అభిమానులు ఈ కష్ట సమయంలో పరాగ్‌కు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. షెఫాలీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read- Tharun Bhascker: ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్.. రూరల్ పాత్రల్లో! టైటిల్ ఏంటంటే?
షెఫాలీ జరీవాలా కొన్నాళ్లుగా యాంటీ ఏజింగ్ మందులు వాడుతున్నందు వల్లే చనిపోయిందని అంతా అనుకుంటున్నారు. ఆమె చనిపోయిన రోజున తన నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకుందని తెలుస్తోంది. అందు నిమిత్తం ఆ రోజంతా ఉపవాసం ఉందని, ఆ ఖాళీ కడుపుతో మందులు తీసుకోవడంతోనే గుండెపోటు వచ్చి ఉండవచ్చనేలా బాలీవుడ్ మీడియా సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. షెఫాలీ జరీవాలా అంత్యక్రియలను జూన్ 29న ఆమె కుటుంబం, భర్త సమక్షంలో నిర్వహించారు. ఆమె చితాభస్మాన్ని కూడా నిమజ్జనం చేశారు. ఆమె మృతి అనంతరం పరాగ్ త్యాగి ఓ ఎమోషనల్ పోస్ట్ చేయగా, మళ్లీ ఇప్పుడు ఆయన చేసిన పోస్ట్‌తో.. షెఫాలీని త్యాగి మరిచిపోలేకపోతున్నాడనేలా కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు