Vishwambhara vs OG
ఎంటర్‌టైన్మెంట్

Vishwambhara vs OG: అన్న‌ద‌మ్ముల మధ్య బాక్సాఫీస్ వార్‌ తప్పదా?

Vishwambhara vs OG: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ఠ రూపొందిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా వాయిదా పడి, అనుకున్న డేట్‌ని ‘గేమ్ ఛేంజర్’కు కేటాయించడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అలా వాయిదా పడిన ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో.. ఇంత వరకు మేకర్స్ ప్రకటించలేదు. రీసెంట్‌గానే ఒక ప్రకటన విడుదల చేశారు. విజువల్స్ పరంగా ప్రేక్షకులకు, అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నామని, అస్సలు కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నామని, త్వరలోనే విడుదల ఉంటుందని ప్రకటించారు. త్వరలోనే అని చెప్పారు తప్పితే.. విడుదల ఎప్పుడనేది మాత్రం మేకర్స్ వెల్లడించలేదు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. చిరంజీవి తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పోటీ పడబోతున్నాడనేలా ఒకటే వార్తలు.. ఆ మ్యాటర్‌లోకి వస్తే..

Also Read- Fish Venkat Wife on Prabhas: ప్రభాస్ పైసా ఇవ్వలే.. అంతా ఫేక్ న్యూస్.. ఫిష్ వెంకట్ భార్య!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో, ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తున్నారో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా జరిపే మీటింగ్స్‌లో కూడా ఈ సినిమా గురించే ఫ్యాన్స్ అరుస్తుంటారు. ‘ఓజీ సినిమా బాగుంటుంది.. చూద్దురుగానీ’ అని స్వయానా పవన్ కళ్యాణ్ కూడా ఓ మీటింగ్‌లో అభిమానులకు తెలిపారు. ఈ సినిమా దసరా స్పెషల్‌గా సెప్టెంబర్ 25న విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. బ్యాలెన్స్ షూట్ కూడా ఇటీవల పవన్ కళ్యాణ్ పూర్తి చేయడంతో.. ఈ సినిమా విడుదల విషయంలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు. అయితే ఈ సినిమాకు పోటీగా.. పోటీగా అంటే పోటీగా కాదులే కానీ, ఒక వారం ముందుగా మెగాస్టార్ చిరంజీవి తన ‘విశ్వంభర’ను థియేటర్లలోకి దించేందుకు సిద్ధమవుతున్నారనేలా టాలీవుడ్‌లో వార్తలు హైలైట్ అవుతున్నాయి.

Also Read- Kareena Kapoor: ఆ హీరోకు ప్రేమతో.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

‘విశ్వంభర’ సినిమాను సెప్టెంబర్ 18న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అదే జరిగితే మెగా ఫ్యాన్స్‌కు ఇది ఎంత హ్యాపీ న్యూసో.. అంత చేదు వార్త కూడా. ఎందుకంటే, ఎటు చూసినా ‘ఓజీ’కి ఇబ్బంది కలిగించడం చేదు వార్త అయితే.. వారం గ్యాప్‌లో మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోల సినిమాలు రావడం హ్యాపీ న్యూస్. సెప్టెంబర్ 18న ‘విశ్వంభర’ వస్తే.. ఒక వారం ఆ సినిమాకు బాగానే ఉంటుంది కానీ, నెక్స్ట్ వీక్ ‘ఓజీ’ దిగితే మాత్రం కలెక్షన్లు భారీగా తగ్గిపోతాయి. మరో వైపు సెప్టెంబర్ 25న వచ్చేందుక బాలయ్య తన ‘అఖండ 2’ చిత్రాన్ని కూడా లాక్ చేశారు. థియేటర్ల షేరింగ్‌తో ఇక్కడే సగం పడిపోతే.. చిరు సినిమా రూపంలో థియేటర్ల కొరత ఏర్పడి.. అది ‘ఓజీ’పై తీవ్ర ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు. ఎటు చూసినా, ఇద్దరు మెగా హీరోల సినిమాలకు ఈ నిర్ణయం అయితే మంచిది కాదు. మరి ఇది నిజమా? లేదంటే రూమరా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!