Leaders offers money
Politics, Top Stories

AP: చిన్న నోటు తీసుకో..పెద్ద నోటు తెచ్చుకో

  • ఏపీ ఎన్నికలలో కొత్త రూట్ లో ప్రలోభాలు
  • ఇప్పటికే మొదలు పెట్టేసిన అధికార వైసీపీ
  • ఓటరు స్లిప్పులు చూసి రూ.10, 50 నోట్లు ఇస్తున్న వైనం
  • రూ.10 నోటు చూపితే బార్ లో మద్యం పంపిణీ
  • రూ.50 చూపితే బియ్యం బస్తా ఫ్రీ
  • ప్రత్యక్షంగా నగదు పంపితే నోట్ నెంబర్లను పసిగట్టేస్తున్న పోలీసులు
  • ఓటుకు రూ.3 వేలు ఎర చూపుతున్న అభ్యర్థులు
  • చిన్న నోట్లను తీసుకెళ్లి పెద్ద నోట్లు తెచ్చుకుంటున్న ఓటర్లు

AP political parties offers gifts and money secretly in new style:

సార్వత్రిక సమరానికి కొద్ది గంటలు మాత్రమే ఉంది. ఈ కొద్దిపాటి సమయంలోనే ఓటర్లను ప్రస్నం చేసుకోవడాకి అభ్యర్థులు కష్టపడుతున్నారు. ఒక పక్క నిఘా వర్గాలకు దొరకకుండా మరో పక్క గుట్టుచప్పడు కాకుండా ఓటర్లను ఎలా మభ్యపెట్టాలో తెలియక రకరకాల అడ్డదారులు అన్వేషిస్తున్నారు. అయితే ఇప్పటికే ఏపీలో ప్రలోభాల పర్వం మొదలైపోయింది. పోలింగ్ కు ముందు వారం రోజులుగా రాత్రి నుంచే పంపకాలు మొదలైపోయాయి. ఒక పక్క ప్రత్యర్థులు, మరో పక్క పోలీసులు ఎక్కడ కనిపెడతారో అనే భయంతో రకరకాల ఎత్తులు, గిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. ఏపీలో చాలా నియోజకవర్గాలలో ముందుగానే ప్రలోభాల వ్యూహానికి తెరతీసేశారు. ఈ విషయంలో అధికార పార్టీ ముందంజలో ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కాస్త ఆలస్యంగా కళ్లు తెరిచింది. చాలా ప్రాంతాల కాలనీలలో కరెంట్ తీసేసీ చీకట్లో ఓటర్లకు డబ్బులు పంచేస్తున్నారు. కొందరు ఓటుకు రూ.2 వేల నుంచి 3 వేలు పంచుతుండగా మరికొందరు వెయ్యి నుంచి 1500 రూపాయలు పంచుతున్నారు. ఓటర్ల స్లిప్పులు చూసి నంబర్లు నమోదు చేసుకుని మరీ నగదు పంపిణీ చేస్తున్నారు.

ఏపీ ఎన్నికలలో ప్రలోభాల సిత్రాలు

ఏపీ ఎన్నికల్లో సిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారపక్షానికి.. విపక్ష కూటమికి మధ్య నడుస్తున్న రాజకీయ వైరం నేపథ్యంలో.. డబ్బు పంపిణీ కష్టంగా మారింది. దీంతో కొత్త తరహా తెలివిని నేతలు ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి తెలివికి తమదైన శైలిలో చెక్ చెబుతున్నారు వారి ప్రత్యర్థులు. ఎన్నికల వేళ తమకు అనుకూలంగా ఓటేయటం కోసం డబ్బు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక పార్టీ తరఫు వారు ప్రయత్నిస్తుంటే.. వారికి చెక్ చెప్పేందుకు ప్రత్యర్థులు మరింత తెలివితో అడ్డుకుంటున్నారు. దీంతో.. డబ్బు పంపిణీ రాజకీయ పార్టీలకు కష్టంగా మారింది. దీంతో కొత్త ఎత్తులకు తెర తీశారు. ఏపీకి చెందిన ఒక పార్టీ వారు ఒకే సీరియల్ కు చెందిన వరుస రూ.10.. రూ.50 నోట్లను ఓటర్లకు పంచి పెడుతున్నారు. ఆ నోట్లను తీసుకొని వారు చెప్పిన చోటుకు వెళితే.. వారికి అందాల్సిన తాయిలాలు అందుతున్న పరిస్థితి. రూ.10 నోటు తీసుకొని వారు చెప్పిన వైన్స్ కు వెళితే..సదరు నోటు తీసుకొని క్వార్టర్ బాటిల్ ఇచ్చేస్తున్నారు. అదే సమయంలో రూ.50 నోటును తీసుకొని వారు చెప్పిన షాపునకు వెళితే.. బియ్యం బస్తాను అందజేస్తున్నారు.

అతి తెలివి ప్రదర్శిస్తున్న అభ్యర్థులు

డబ్బులు నేరుగా పంపిణీ చేస్తే.. ఫిర్యాదులు చేసి పట్టించే వీలు ఉండటంతో ఎన్నికల ప్రచారం వేళలోనే.. కూపన్లు .. చిన్న నోట్లను చేతికి ఇస్తున్నారు. వాటిని తీసుకొని.. చెప్పిన చోట్లకు వెళితే.. వారికి అందాల్సిన బహుమతులు అందుతున్నాయి. దీంతో.. వీటిని క్రాక్ చేసేందుకు రాజకీయ పార్టీలు ఏ రోజుకు ఆ రోజు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఏమైనా.. ఇలాంటి ముదర తెలివితేటలు ఏపీ నేతలకే సాధ్యమన్న మాట వినిపిస్తోంది. తరచి చూస్తే.. ఇలాంటివెన్నో సిత్రాలు ఏపీ ఎన్నికల్లో అడుగడుగునా కనిపిస్తున్నట్లుగా చెప్పక తప్పదు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!