Hari Hara Veera Mallu Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) సినిమా వస్తుందంటే.. టాలీవుడ్‌లో ఉండే సందడే వేరు. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేని క్రేజ్ కళ్యాణ్ సొంతం. ఏదైనా సరే.. సరికొత్త రికార్డులు నమోదవ్వాల్సిందే. తాజాగా వచ్చిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ట్రైలర్ ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. గురువారం ట్రైలర్ విడుదలైన క్షణం నుండి అభిమానులు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డ్‌ను ఈ సినిమా పేరిట సృష్టించారు. ట్రైలర్ స్క్రీనింగ్‌కు ఆ థియేటర్ క్యాన్సిల్ అయింది, ఈ థియేటర్ క్యాన్సిల్ అయిందని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారికి గూబ గుయ్‌మనిపించే స్థాయిలో చరిత్ర సృష్టించింది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం ట్రైలర్ నుంచే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ప్రారంభిస్తుందని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పిన మాట నిజమైంది. ఈ ట్రైలర్ తెలుగులో కేవలం 24 గంటల్లోనే 48 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, తెలుగు సినిమాల పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 62 మిలియన్ల ప్లస్ వ్యూస్ సాధించింది.
Also Read- Allu Arvind: రూ.100 కోట్ల స్కామ్‌లో అల్లు అరవింద్.. ఈడీ ప్రశ్నల వర్షం!
‘వీరమల్లు’ ట్రైలర్ విధ్వంసంతో ఇంతకు ముందు ‘పుష్ప 2’ ట్రైలర్ పేరిట ఉన్న రికార్డ్ కూడా బద్దలైంది. ‘పుష్ప 2’ చిత్ర ట్రైలర్ 24 గంటల్లో 44 మిలియన్ల వ్యూస్ రాబట్టి రికార్డ్‌ని క్రియేట్ చేయగా, ఆ రికార్డును బద్దలు కొట్టి పవన్ కళ్యాణ్ ‘వీరమల్లు’తో సరికొత్త రికార్డ్‌ని క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని చారిత్రక యోధుడు పాత్రలో కనిపించడం అందరినీ ఆకర్షించడంతో పాటు.. ట్రైలర్‌లో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉందంటూ సినీ ప్రముఖులు సైతం ప్రశంసిస్తుండటం విశేషం. పవన్ కళ్యాణ్ లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్‌తో.. ఇటీవల కాలంలో వచ్చిన అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ప్రశంసలు అందుకుంటోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎం. రత్నం సమర్పణలో.. ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
Also Read- Fish Venkat: ఫిష్ వెంకట్‌కు రూ. 50 లక్షలు.. ప్రభాస్ నిజంగానే మహారాజు!
ఇక దర్శకుడు జ్యోతి కృష్ణ ట్రైలర్‌ను రూపొందించిన తీరుకు ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఈ ట్రైలర్ అందరి అంచనాలను మించేలా ఉండటంతో పాటు.. వీరమల్లును ఆయన ఒక పాత్రగా కాకుండా, సినిమాటిక్ శక్తిగా మలిచారు. బలమైన భావోద్వేగాలు, అద్భుతమైన యుద్ధ సన్నివేశాల మేళవింపుతో ట్రైలర్‌ను మలిచిన తీరుతో మెగాభిమానులంతా ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అనేంతగా సినిమా కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు. అలాగే ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి తన నేపథ్య సంగీతంతో ట్రైలర్‌ను మరోస్థాయికి తీసుకెళ్ళారు. రాజ కుటుంబీకురాలుగా ఇందులో నిధి అగర్వాల్ కనిపించగా.. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ స్క్రీన్ ప్రజెన్స్, సాయి మాధవ్ బుర్రా రాసిన శక్తివంతమైన సంభాషణలు ట్రైలర్‌కు మరింత బలాన్ని జోడించాయి. ట్రైలర్‌తోనే చరిత్ర సృష్టించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం.. జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు